Site icon NTV Telugu

Japan: టార్గెట్ చైనా, నార్త్ కొరియా.. దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణులు మోహరించనున్న జపాన్

Japan

Japan

Japan deploying long-range missiles to counter China: నిత్యం చైనా, నార్త్ కొరియాల నుంచి ఎదురవుతున్న బెదిరింపులకు ధీటుగా.. తమ సార్వభౌమాధికారాన్ని, తన భూభాగాలను రక్షించుకోవడానికి.. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు జపాన్ సిద్ధం అవుతుంది. ముక్యంగా జపాన్ సరిహద్దుల్లో ఉన్న చైనా, నార్త్ కొరియాలే లక్ష్యంగా క్షిపణులను మోహరిస్తోంది. దాదాపు 1000 దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణులను మోహరించే ఆలోచనలో జపాన్ ఉన్నట్లు తెలుస్తోంది.

క్షిపణుల పరిధిని 100 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లకు పెంచడానికి ఇప్పటికే ఉన్న ఆయుధాలను సవరించినట్లు తెలుస్తోంది. నౌకలు, విమానాల ద్వారా ప్రయోగించబడేలా.. ప్రధానంగా దక్షిణ నాన్సీ దీవుల చుట్టూ వీటిని మోహరించబోతున్నారు. ఈ ప్రాంతం నుంచి ఉత్తర కొరియా, చైనా తీరాలను క్షిపణులు ఈజీగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే వీటిపై జపాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.

Read Also: MP Dharmapuri Arvind: తెలంగాణకు కేసీఆర్ న్యూక్లియర్ బాంబ్‌లా తయారయ్యారు

రెండో ప్రపంచ యుద్ధం తరువాత జపాన్ దేశానికి సొంతంగా ఆర్మీ అనేది లేదు.. కేవలం ఆత్మరక్షణ కోసమే దళాలు ఉన్నాయి. వీటికి కూడా నిధుల కేటాయింపు అంతంత మాత్రంగానే ఉంది. అయితే గతంలో షింజో అబే ప్రధానిగా ఉన్న సమయంలో కూడా జపాన్ దేశానికి సైన్యం ఉండాలని భావించారు. తాజాగా ప్రధాని కిషిడా అధికారంలోకి వచ్చిన తర్వాత జపాన్ రక్షణ కోసం బడ్జెట్ లో ఒక శాతం కేటాయిస్తానని వెల్లడించారు. దీంతో బడ్జెట్ లో రక్షణకోసం సుమారుగా 40 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టే అవకాశం ఉంది.

దక్షిణ చైనా సముద్ర తీరంలో చైనా ప్రాబల్యం పెరుగుతోంది. తన సైనిక శక్తిని చూపించి, ఇతర దేశాలను బెదిరిస్తోంది. దీంతో పాటు ఇటీవల అమెరికన్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన కూడా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచింది. దీంతో తైవాన్ ను చైనా హస్తగతం చేసుకునేలా ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే తైవాన్ ద్వీపాన్ని చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ చుట్టుముట్టి యుద్ధ విన్యాసాలు చేస్తోంది. ఇటీవల చైనా క్షిపణులు జపాన్ సముద్ర తీరంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు జపాన్ సిద్ధం అవుతోంది.

Exit mobile version