‘Jamie Oliver of Iran’ beaten to death in police custody month after Mahsa Amini: ఇరాన్ లో మరోసారి ఆందోళనలు ఎగిసిపడే అవకాశం ఏర్పడింది. హిజాబ్ సరిగ్గా ధరించలేదని 23 ఏళ్ల మహ్సా అమిని అనే యువతిని అరెస్ట్ చేసి తీవ్రంగా దాడి చేయడంతో ఆమె మరణించింది. దీంతో ఇస్లామిక్ దేశం అయిన ఇరాన్ లో తీవ్ర స్థాయిలో నిరసనలు ఎగిసిపడ్డాయి. అక్కడి మహిళలు హిజాబ్ విసిరేస్తూ.. జట్టు కత్తిరించుకుని, ప్రభుత్వానికి, అధ్యక్షుడికి వ్యతిరేకంగా తీవ్రంగా ఆందోళన చేశారు. ఈ ఆందోళనలు ప్రభుత్వం తీవ్రంగా అణిచివేస్తోంది. హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో వందలాది మంది మరణించారు.
ఇదిలా ఉంటే ఇరాన్ ప్రముఖ చెఫ్. ‘జామి ఆలివర్ ఆఫ్ ఇరాన్’ అనే పిలువబడే మెహర్షాద్ షాహిదీని కూడా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ షాహిదీని తీవ్రంగా కొట్టడంతో ఆయన మరణించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొనందుకు ఆయన్ను అక్టోబర్ 25న పోలీసులు అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో గత బుధవారం ఆయన మరణించారు. అక్టోబర్ 29న ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. షాహిదీ మరణం ఇరాన్ లో మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: Bharat Jodo Yatra: నగరానికి చేరుకున్న భారత్ జోడో యాత్ర.. అక్కడ ట్రాఫిక్ మళ్లింపు
19 ఏళ్ల షాహిదీని పోలీసులు, ఇరాన్ భద్రతా బలగాలు తలపై లాఠీలతో తీవ్రంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగి మరణించినట్లు తెలుస్తోంది. పోలీసులు కొట్టడం వల్లే మా కుమారుడు ప్రాణాలు కోల్పోయాని ఆయన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం చెప్పవద్దని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎదురవుతున్నట్లు వెల్లడించారు. అతడు గుండెపొటుతో మరణించాడని చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 16న 22 ఏళ్ల కుర్దిష్ మహిళ రాజధాని టెహ్రాన్ లో తన కుటుంబంతో ఉన్న సమయంలో హిజాబ్ సరిగ్గా ధరించలేదని ఆరోపిస్తూ.. మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై యావత్ ఇరాన్ యువత, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తించారు. ఈ ఘటన తర్వాత నిరసనల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్న పలువురిని చంపేశారు అక్కడి పోలీసులు. ప్రస్తుతం షాహిదీ మరణంతో మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమం ఇరాన్ లో చెలరేేగే అవకాశం ఉందని తెలుస్తోంది.