Site icon NTV Telugu

Ivana Trump: డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య మృతి

Ivana Trump

Ivana Trump

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) గురువారం మరణించినట్లు ట్రంప్ ప్రకటించారు. న్యూయార్క్ లోని ఇంట్లో మరణించింది ఇవానా ట్రంప్. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ పామ్ ట్రూత్ సోషల్ లో వెల్లడించారు. ‘‘ ఆమె అద్భుతమైన వ్యక్తి, అందమైన మహిళ.. ఆమె గొప్పగా స్పూర్తిదాయకమైన జీవితాన్ని గడిపింది.. రెస్ట్ ఇన్ పీస్ ఇవానా’’ అని ట్రంప్ కామెంట్ చేశారు.

Read Also: Instagram: ఇన్‌స్టా డౌన్ అయ్యిందంటూ కూత కూసిన ‘పిట్ట’

మాజీ చెకోస్లోవేకియాలో కమ్యూనిస్ట్ పాలనలో పెరిగిన ఇవానా ట్రంప్ 1977లో రియల్ ఎస్టేట్ డెవలపర్ గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ను పెళ్లాడింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. డొనాల్డ్ జూనియర్, ఇవాంకా ట్రంప్, ఎరిక్ ఉన్నారు. ఆమె మరణం పట్ల కుమారుడు డొనాల్డ్ జూనియర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 80వ దశకంలో డొనాల్డ్ ట్రంప్- ఇవానా ట్రంప్ న్యూయర్క్ లో ప్రముఖ జంటల్లో ఒకరుగా ఉన్నారు. ఇవానా ట్రంప్ వ్యాపారంలో కీలకంగా వ్యవహరించడంతో ట్రంప్ ఆస్తి, వ్యాపారం చాలా పెరిగింది. అయితే నటి మార్లా మాపుల్స్ తో డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఈ కాపురంలో చిచ్చపెట్టాయి. 1993లో డొనాల్డ్ ట్రంప్ మాపుల్స్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు కూడా ఎక్కవ కాలం కొనసాగలేకపోయారు. 1999లో విడిపోయారు. ఆ తరువాత డొనాల్డ్ ట్రంప్ మూడో వివాహంగా 2005లో మెలానియా ట్రంప్ ను వివాహం చేసుకున్నాడు.

Exit mobile version