Site icon NTV Telugu

Morphed Photos: పోర్నోగ్రఫీ వెబ్‌సైట్‌లో ప్రముఖ మహిళల మార్ఫింగ్ ఫోటోలు.. ఇటలీ ప్రధాని ఫైర్

Giorgia Meloni

Giorgia Meloni

Morphed Photos: ఇటలీ దేశంలో మార్ఫింగ్ ఫోటోలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మార్ఫింగ్ ఫోటోల్లో ఇటలీ ప్రధాన మంత్రి మెలోని సోదరి అరియానాతో పాటు ప్రతిపక్ష నాయకురాలు ఎల్లీ ష్లీన్, ఇన్‌ఫ్లుయెన్సర్ చియారా ఫెర్రాగ్ని, ఈయూ చట్టసభ్యురాలు అలెశాండ్రా మోరెట్టి లాంటి ప్రముఖ మహిళల ఫోటోలు ‘ఫికా’ అనే పోర్నోగ్రఫీ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి. ఈ మార్ఫింగ్ చేసిన ఫోటోల్లో మహిళల శరీర భాగాలతో పాటు సంభోగం చేస్తున్న వీడియోలను రూపొందించారు. ఈ విషయంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రంగా మండిపడింది. ఈ మార్ఫింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

Read Also: Saroor Nagar Husband M*urder case: సరూర్ నగర్ భర్త హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. డంబెల్స్ తో మోది..

ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది.. మహిళలను అవమానించబడిన, హింసకు గురైన వారందరికీ అండగా ఉంటామని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేర్కొన్నారు. 2025లో కూడా ఒక మహిళ గౌరవాన్ని కించపరచడం దారుణం అన్నారు. అజ్ఞాతంలో ఉండి మహిళలను లైంగిక, అశ్లీల దూషణలతో దాడి చేయడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశాను.. త్వరలోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తానని హామీ ఇచ్చింది.

Read Also: PM Modi: జపాన్ బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించిన మోడీ

ఇక, మరో ఘటనలో ‘మియా మొగ్లియే’ అనే ఇటాలియన్ ఫేస్‌బుక్ గ్రూప్‌లో పురుషులు తమ భార్యలు లేదా తెలియని మహిళల అశ్లీల చిత్రాలను షేర్ చేసుకోవడంతో మెటా కంపెనీ దాన్ని కూడా మూసివేసింది. ఈ గ్రూప్‌లో 32 వేల మంది సభ్యులు ఉన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని సెంటర్-లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు వలేరియా కాంపగ్నా మాట్లాడుతూ.. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచి వేసింది.. నేను మౌనంగా ఉండలేను.. దీనిపై పూర్తిస్థాయిలో పోరాటం చేస్తాను.. మహిళలు స్వేచ్ఛగా, గౌరవంగా, భయం లేకుండా జీవించే హక్కు గురించి ఆమె ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. కాగా, ఈ రెండు ఘటనలపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు.. మహిళల గౌరవాన్ని కించపరిచే ఇలాంటి ఆన్‌లైన్ వేదికలపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్ పెరుగుతుంది.

Exit mobile version