Italy Protests: ఇటలీలో జెన్-ఆల్ఫా విధ్వంసం.. రూ. 4,400 కోట్లు బూడిద!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Italy Protests: ఇటలీ వీధులు ఇప్పుడు నిరసనల సెగతో రగిలిపోతున్నాయి. సాధారణంగా రాజకీయ ఆందోళనల్లో పెద్దలు లేదా కాలేజీ యువత రోడ్లపైకి వస్తుంటారు. కానీ ఇటలీలో మాత్రం ఇంకా ఓటు హక్కు కూడా రాని స్కూల్ పిల్లలు, ‘జెన్-ఆల్ఫా’ తరానికి చెందిన మైనర్లు రోడ్లపైకి వచ్చి ఊహించని రీతిలో విధ్వంసం సృష్టించారు. శనివారం జరిగిన తీవ్ర ఆందోళనల్లో ఆందోళనకారులు ఏకంగా రూ. 4,400 కోట్ల విలువైన ఆస్తులను తగలబెట్టి బూడిద చేసేశారు. ఈ పరిణామం ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇటలీ పోలీసులు రంగంలోకి దిగి దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ ‘ANSA’ వెల్లడించింది. ఇందులో దిగ్భ్రాంతికరమైన విషయమేమిటంటే.. పట్టుబడిన వారిలో మెజారిటీ నిరసనకారులు కేవలం 16 ఏళ్ల లోపు వయసున్న మైనర్లే. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ప్రధాని మెలోని ప్రజలను శాంతియుతంగా ఉండాలని కోరారు. దేశాన్ని తగలబెడుతున్న వారు దేశ శ్రేయస్సు కోరేవారు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంత చిన్న వయసులోనే విద్యార్థులు ఈ స్థాయిలో తిరుగుబాటు చేయడానికి అసలు కారణం ‘ఎడ్యుకేషన్ బడ్జెట్’. ప్రభుత్వం చదువుల కంటే ఆయుధాల కొనుగోళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందంటూ విద్యార్థులు ‘నో వెపన్స్’ నినాదంతో రోడ్డెక్కారు. 2024 లెక్కల ప్రకారం ఇటలీ తన జీడీపీలో దాదాపు 4 శాతం (రూ. 9.21 లక్షల కోట్లు) విద్యపై ఖర్చు పెట్టింది. అయితే అదే సమయంలో అమెరికా, నాటో ఒత్తిళ్లకు తలొగ్గి ఏకంగా రూ. 2.8 లక్షల కోట్లను ఆయుధాల కొనుగోలుకు వెచ్చించారని, మొత్తం రక్షణ బడ్జెట్ రూ. 4.75 లక్షల కోట్లకు చేరిందని విద్యార్థులు మండిపడుతున్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దే బడ్జెట్‌ను యుద్ధ సామగ్రికి ఎలా కేటాయిస్తారంటూ నిలదీస్తున్నారు. 2027లో ఇటలీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ఈ నిరసనలు ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పడేశాయి. ఈ అల్లర్ల వెనుక వామపక్ష నాయకుల హస్తం ఉందని, వారే అమాయక మైనర్లను రెచ్చగొట్టి వీధుల్లోకి పంపించారని ప్రధాని మెలోని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న ముఠాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మరోవైపు ఈ నిరసనల మంటలు పొరుగు దేశమైన ఫ్రాన్స్‌కు కూడా పాకాయి. అక్కడ కూడా విద్యార్థులు ఆందోళనలకు దిగి ఆదివారం ఒక్కరోజే దాదాపు 1,500కి పైగా దుకాణాలను తగలబెట్టడంతో యూరప్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Also Read
- Modi-Netanyahu: భారత్‌తో సంబంధాలపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
- Canadian Military: కెనడా మిలిటరీ శిక్షణలో తీవ్ర విషాదం.. నలుగురు సైనికులు మృతి, 39 మందికి గాయాలు
- Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
తాజావార్తలు
-
Italy Protests: ఇటలీలో జెన్-ఆల్ఫా విధ్వంసం.. రూ. 4,400 కోట్లు బూడిద!
-
Prabhas Birthday Special : డార్లింగ్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇదొక్కటేనా?
-
YSRCP : వైసీపీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత
-
Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
-
Hyderabad: రూ.16 కోట్ల చిట్టీల మోసం.. ప్రధాన నిందితురాలు సీత అరెస్ట్
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!