NTV Telugu Site icon

Israel-Hamas War: హమాస్ కిడ్నాప్‌తో వైరల్ అయిన ఇజ్రాయిల్ మహిళ.. రెస్క్యూ సమయంలో వంటపాత్రలు కడుగుతోంది..

Noa Argamani

Noa Argamani

Israel-Hamas War: హమాస్, ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 07న చేసిన దాడి సామాన్య పాలెస్తీనియన్ల పాటిట విషాదంగా మారింది. హమాస్ గతేడాడి ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 1200 మంది ప్రజల్ని హతమార్చడంతో పాటు 240 మందిని హమాస్ కిడ్నాప్ చేసింది. ఆ సమయంలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పౌరుల్ని కిడ్నాప్ చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఆ సమయంలో నోవా అర్గమణి అనే యువతిని కిడ్నాప్ చేసి బైక్‌పై గాజాలోకి తీసుకుకెళ్తున్న వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.ఇలా బందీలుగా పట్టుకున్న పలువురు యువతులు, మహిళల్ని హమాస్ మిలిటెంట్లు లైంగికంగా వేధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. బందీల మార్పిడి సందర్భంగా పలువురు మహిళలు తమకు జరిగిన అనుభవాలను పంచుకున్నారు.

ఇదిలా ఉంటే గత వారం ఇజ్రాయిలీ బలగాలు గాజాపై సాహసోపేత ఆపరేషన్ నిర్వహించి నోవా అర్గమణితో పాటు మరో ముగ్గురు బందీలు అల్మోగ్ మీర్ జాన్, ఆండ్రీ కోజ్లోవ్, ష్లోమి జివ్‌లను రెస్క్యూ చేశారు. బందీల రెస్క్యూ సమయంలో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో వందలాది మంది మరణించారు. చివరకు నలుగురు ఇజ్రాయిలీలను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) సురక్షితంగా తీసుకువచ్చింది.

Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు తీర్పు..

రక్షించబడిన నోవా అర్గమణితో పాటు ముగ్గురు బందీలను అక్టోబర్ 7న నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై దాడి చేసి హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. నోవా అర్గమణిని ఒక ప్రదేశం నుంచి మరో ముగ్గురిని వేరే అపార్ట్మెంట్ నుంచి రక్షించారు. దాదాపుగా 245 రోజుల పాటు బందీలు హమాస్ చెరలో ఉన్నారు. కిడ్నాప్ సమయంలో నోవా అర్గమణి తనను చంపొద్దని వేడుకోవడం, హమాస్ మిలిటెంట్లు ఆమెను, ఆమె బాయ్ ఫ్రెండ్ నాథన్‌ని పట్టుకున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.

హమాస్ చెర నుంచి సురక్షితంగా రక్షించబడిన నోవా అర్గమణి మీడియాతో మాట్లాడుతూ.. తనను కిడ్నాప్ చేసిన సమయంలో తనను ఖచ్చితంగా చంపుతారని అనుకున్నానని చెప్పారు. గత 7-8 నెలలుగా తనను 4 వేర్వేరు ప్రాంతాలకు మార్చారని, చివరి ప్రాంతంలో తనను పాత్రలు కడిగేలా చేశారని చెప్పుకొచ్చింది. తనను వేరే ప్రాంతానికి మార్చే సందర్భంలో తనను పాలెస్తీనియన్ మహిళల డ్రెస్ వేసేవారని చెప్పింది. ఇజ్రాయెల్ సైనికులు ఆమెను రక్షించడానికి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆమె పాత్రలు కడుగుతున్నట్లు చెప్పింది. ఆ క్షణం భయానకంగా అనిపించింది, సైనికులు ధైర్యం చూసి, ఇకపై తాను ఇక్కడ ఉండకపోవచ్చని అనుకున్నట్లు చెప్పింది. సెంట్రల్ గాజాలోని నుసీరత్ ప్రాంతంలో శనివారం జరిగిన ఆపరేషన్‌‌లో ఈమెను రక్షించారు.