Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హతమార్చారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ బలగాలు గాజాపై విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 30 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇజ్రాయిల్ రఫాపై దండయాత్ర చేస్తున్నాయి. ఈజిప్టు-గాజా దక్షిణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న రఫా నగరంపై ప్రణాళికాబద్ధమైన దాడుల నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంపై నియంత్రణ సాధించినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) మంగళవారం తెలిపింది. ఇజ్రాయిల్ ట్యాంకులు రఫాలోకి చొచ్చుకెళ్లాయి.
గాజా నగరంపై దాడుల అనంతరం రఫా హమాస్ ఉగ్రవాదులకు కోటగా మారింది. ఈ నేపథ్యంలో ఈ నగరంలో ఉన్న టెర్రిస్టులను కనుగొనడానికి ఆ ప్రాంతాన్ని ప్రత్యేక దళాలు స్కాన్ చేస్తున్నాయని ఇజ్రాయిల్ సైన్యం చెప్పింది. తూర్పు రఫాలో ఆపరేషణ్ చేపడుతున్నమని తెలిపింది. హమాస్ ఉగ్రవాదుల్ని నిర్మూలించడానికి తూర్పు రఫాలోని నిర్ధిష్ట ప్రాంతాల్లో హమాస్ మౌళిక సదుపాయాలను కూల్చేవేయడానికి ఐడీఎఫ్, ISA (ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ, షిన్ బెట్) ఇంటెలిజెన్స్ ఆధారంగా సైన్యం గ్రౌండ్ ట్రూప్స్ ఖచ్చితమైన ఉగ్రవాద నిరోధక చర్యల్ని ప్రారంభించాయని ఒక ప్రకటనలో ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది.
Read Also: Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..!
మరోవైపు ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వ ఒప్పందాన్ని హమాస్ అంగీకరించినప్పటికీ, ఇజ్రాయిల్ దీనిని అంగీకరించలేదు. కాల్పుల విమరణపై హమాస్ అంగీకారం తెలిపిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయిల్ రఫాపై దాడులు ప్రారంభించింది. ఇజ్రాయిల్ ట్యాంకులు గాజాలోని చివరి హమాస్ కోట అయిన రఫాలోకి ప్రవేశించాయని, ఈజిప్టు సరిహద్దు నుంచి 200 మీటర్లకు చేరువలో ఉన్నాయని నివేదికలు పేర్కొన్నాయి. దాడులు తీవ్రం చేసిన తరుణంలో అక్కడి తూర్పు రఫాలోని ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయిల్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. హమాస్‌ని పూర్తిగా అంతం చేయాలనే నిర్ధిష్ట వైఖరికి ఇజ్రాయిల్ కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడారు. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ రఫాపై భూ దండయాత్ర వినాశకరమైన మానవతా పరిణామాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.