Site icon NTV Telugu

Netanyahu: గాజా స్వాధీనంపై నెతన్యాహు కీలక ట్వీట్.. ఈసారి ఏమన్నారంటే..!

Netanyahu

Netanyahu

గాజాను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదించింది. ఇందుకోసం ప్రణాళికలు రచించింది. అయితే ఈ నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపింది. స్వదేశం, విదేశం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. గాజాను స్వాధీనం చేసుకునే నిర్ణయం సరైంది కాదని ఇప్పటికే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ బహిరంగంగా తేల్చి చెప్పారు. తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నెతన్యాహు వెనుకడుగు వేశారు.

ఇది కూడా చదవండి: Haryana Govt: మతం దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే.. పదేళ్లు జైలుకే..!

తాజాగా ఎక్స్‌ ట్విట్టర్‌లో నెతన్యాహు కీలక పోస్ట్ చేశారు. గాజాను ఆక్రమించుకోవడం లేదని.. హమాస్ నుంచి విముక్తి కల్పిస్తామని తెలిపారు. శాంతియుత పరిపాలనను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం బందీలను విడిపించడం.. భవిష్యత్‌లో వచ్చే ముప్పులను నివారించడానికి సహాయపడుతుందని నెతన్యాహు తెలిపారు.

ఇది కూడా చదవండి: Asif Quureshi : ప్రాణం తీసిన పార్కింగ్ పంచాయితీ

గాజా-ఇజ్రాయెల్ మధ్య దాదాపు 22 నెలలుగా యుద్ధం సాగుతోంది. 2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి కొంత మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఆ నాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఇంకా కొంత మంది వారి దగ్గరే ఉన్నారు. అందరినీ ఒకేసారి విడిచిపెట్టాలని ఇజ్రాయెల్ కోరింది. అందుకు హమాస్ అంగీకరించలేదు. దీంతో ఇజ్రాయెల్ దాడులను కొనసాగించింది.

Exit mobile version