NTV Telugu Site icon

Israel: లెబనాన్‌కు నెతన్యాహు వీడియో వార్నింగ్.. గాజాకు పట్టిన గతే పడుతుందని హెచ్చరిక

Israel Warning

Israel Warning

లెబనాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హిజ్బుల్లా లక్ష్యంగా దాడులు తీవ్రం కాబోతున్నాయని.. తక్షణమే సరిహద్దు ప్రజలు ఖాళీ చేయాలని వీడియో ద్వారా నెతన్యాహు సందేశం పంపించారు. గాజాకు పట్టిన గతే హిజ్బుల్లాకు పడుతుందని తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. గాజాలో ఎదురైన పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే వెంటనే లెబనీస్ ప్రజలు నివాసాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Sabarimala pilgrimage: శబరిమల దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్స్.. నిర్ణయాన్ని సమర్ధించుకున్న పినరయి సర్కార్..

ఇదిలా ఉంటే హిజ్బుల్లా కూడా గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్‌‌పై ఎదురుదాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్ ఓడరేవు నగరమైన హైఫాపై రాకెట్లు ప్రయోగించింది. దీంతో ఘర్షణ మరింత తీవ్రమైంది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌లోకి 85 క్షిపణులు సరిహద్దులు దాటాయని ఇజ్రాయెల్ మిలటరీ వెల్లడించింది. లెబనీస్ ప్రజలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తే.. ఇజ్రాయెల్ నగరాలు, పట్టణాలపై దాడులు కొనసాగుతాయని హిజ్బుల్లా కూడా వార్నింగ్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: 50 వేలు దాటిన మద్యం షాపుల దరఖాస్తులు.. ప్రభుత్వానికి రూ.1000 కోట్ల ఆదాయం

గతేడాది అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన దగ్గర నుంచి ఈ యుద్ధం కొనసాగుతూ ఉంది. ఏడాది అయినా ఇంకా ఉధృతం అవుతుంది తప్ప తగ్గడం లేదు. హమాస్‌కు మద్దతు తెలిపిన హిజ్బుల్లా లక్ష్యంగా ఇప్పుడు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇప్పటికే హమాస్, హిజ్బుల్లా ముఖ్య నేతలందరినీ మట్టుబెట్టింది. ఇక గత నెలలో హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై 180 క్షిపణులను ప్రయోగించింది. ఇప్పుడు ఇరాన్‌పై కూడా దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌ ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా లెబనాన్‌ను ఇజ్రాయెల్ తీవ్రంగా హెచ్చరించింది. మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగేలానే ఉన్నాయి.

 

Show comments