Benjamin Netanyahu: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధంలోకి అమెరికా రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి మరింత దిగడంతో పశ్చిమాసియా రగిలిపోతుంది. ఈ ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతాన్యహు కీలక ప్రకటన చేశారు. టెహ్రాన్‌తో సుదీర్ఘకాలం యుద్ధం ఉండబోదని తెలిపారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో తాము చేపట్టిన దాడుల్లో టార్గెట్ కి చేరువైనట్లు చెప్పుకొచ్చారు.
Read Also: Yami Gautam: పాత్ర బలంగా ఉంటే.. స్క్రిప్ట్ కూడా పట్టించుకోను..
ఇక, ఇరాన్‌పై అమెరికా బాంబు దాడులు చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ.. టెహ్రాన్‌లోని ఫోర్డో అణు కేంద్రాన్ని యూఎస్ తీవ్రంగా ధ్వంసం చేసింది అన్నారు. అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్‌ను వెనక్కి నెట్టామని చెప్పారు. ఆ దేశంతో ఉన్న ముప్పును తొలగించుకున్నాం.. టార్గెట్ ను సాధించడానికి అవసరానికి మించి మా చర్యలను కొనసాగించబోమని వెల్లడించారు. ఇక, మా టార్గెట్‌ను చేరుకుంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ పూర్తయినట్లే.. అప్పుడు యుద్ధం కూడా ఆగిపోతుందని తెలిపారు. ఇక, ప్రస్తుత ఇరాన్ పాలకులు మమ్మల్ని నాశనం చేయాలని చూశారు.. అందు కోసమే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది అని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.
Read Also: Kuberaa : హార్ట్ ఫుల్ గా సినిమా తీస్తే ఆడియన్స్ ధియేటర్స్ కు వస్తారు : ధనుష్
అయితే, ఈ యుద్ధంలో ప్రధానంగా మా అస్థిత్వానికి పొంచి ఉన్న రెండు ముప్పులను తాము తొలగించాలని అనుకున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఒకటి అణ్వాయుధాలు.. రెండు బాలిస్టిక్ క్షిపణులను పూర్తిగా ధ్వంసం చేశాం.. ఈ లక్ష్యాలను సాధించే దిశగా మేం ఒక్కో అడుగు వేస్తూ ముందుకు కొనసాగుతున్నాం.. ఇప్పుడిప్పుడే మేం వాటి దగ్గరకు చేరువయ్యాం.. టెహ్రాన్‌తో సుదీర్ఘకాలం యుద్ధం మాత్రం కొనసాగించబోం.. అలాగే, అనుకున్న ఫలితం రాక ముందే పోరాటం నుంచి తప్పుకునేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని వెల్లడించారు.
