Site icon NTV Telugu

Iran: హసన్ నస్రల్లా మాదిరిగా ఇరాన్ అధ్యక్షుడి హత్యకు ఇజ్రాయెల్ కుట్ర! కీలక నివేదిక

Iran

Iran

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ హత్యకు ఇజ్రాయెల్ కుట్ర పన్నిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనుబంధ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఆదివారం నివేదించింది. జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. అయితే జూన్ 16న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మసౌద్ పెజెష్కియన్ స్వల్పంగా గాయపడినట్లుగా ఫార్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. టెహ్రాన్‌లోని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న భవనంపై ఇజ్రాయెల్ క్షిపణి పడింది. దీంతో తప్పించుకునే క్రమంలో పెజెష్కియన్ కాలికి గాయమైంది. అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో పాటు పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘర్ గాలిబాఫ్, న్యాయవ్యవస్థ చీఫ్ మొహ్సేని ఎజీ, ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరైనట్లు నివేదిక తెలిపింది.

ఇది కూడా చదవండి: Shruti : ఎప్పుడుపడితే అప్పుడు పార్టీలు, పబ్‌లకు వెళ్తోంది.. నటిని కొట్టి చంపబోయిన భర్త!

బీరూట్‌లో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా మాదిరిగా ఇరాన్ అధ్యక్షుడిని చంపాలని ఇజ్రాయెల్ ప్రణాళిక రచించినట్లు నివేదిక పేర్కొంది. తప్పించుకునే మార్గాలు లేకుండా ఇరు వైపుల నుంచి ఆరు క్షిపణులు భవనంపైకి దూసుకెళ్లాయి. భవనం కింద అంతస్తులో ఇరానియర్ అధికారులంతా ఉన్నారు. పేలుళ్ల తర్వాత విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ముందుగానే అత్యవసర హాచ్‌ను సిద్ధం చేయడంతో దాని గుండా తప్పించుకోగలిగారని ఫార్స్ నివేదిక స్పష్టం చేసింది. పెజెష్కియన్‌తో పాటు అధికారులు బయటకు వెళ్తుండగా స్వల్పంగా గాయాలు పాలయ్యారు. ఇక ఇరాన్ అగ్ర నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని కూడా హత్య చేయాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది. కానీ సరైన ప్రణాళికలు లేకపోవడంతో వీలు కాలేదని సమాచారం. నస్రల్లా హత్యకు వేసిన ప్రణాళిక విజయవంతం కాగా… ఇరాన్ అధ్యక్షుడి విషయంలో మాత్రం విఫలమైందని నివేదిక వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Medchal Murder: చెత్త గొడవ.. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు..

Exit mobile version