Site icon NTV Telugu

Hugs And Kisses: 738 రోజుల తర్వాత కలిసిన జంటలు.. బందీల వీడియోలు వైరల్

Israel

Israel

ఒక్కరోజు కాదు.. రెండ్రోజులు కాదు.. ఏకంగా 738 రోజులు హమాస్ చెరలో బందీలుగా ఉండిపోయారు. తిరిగి వస్తారో.. లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ట్రంప్ ప్రోదల్బంతో గాజా-ఇజ్రాయెల్‌లో శాంతి వాతావరణం నెలకొంది. రెండేళ్ల పాటు కొనసాగిన నిరీక్షణకు సోమవారం నవోదయం లభించింది. 20 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. దీంతో ఇజ్రాయెల్ దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఎటుచూసినా కౌగిలింతలు, కిస్‌లు కనిపించాయి. తమ వారిని చూసి గట్టిగా కౌగిలించుకుని… కన్నీటి పర్యంతం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఐడీఎఫ్ ఎక్స్‌లో పంచుకుంది.

ఇది కూడా చదవండి: Trump-Meloni: మెలోని అందమైన అమ్మాయి.. అలాంటే అభ్యంతరం లేదు కదా? నవ్వులు పూయించిన ట్రంప్

అవినాటన్ ఓర్.. విడుదలైన 20 మంది బందీలలో ఒకరు. అవినాటన్ ఓర్.. ఆమె స్నేహితురాలు నోవా అర్గామణి అక్టోబర్ 7, 2023న నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి హమాస్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. గతేడాది నోవా అర్గామణిని ఇజ్రాయెల్ దళాలు రక్షించి క్షేమంగా తీసుకొచ్చారు. ఇక రెండేళ్ల తర్వాత అనినాటన్ ఓర్ సోమవారం విడుదలయ్యాడు. ఇక రెండేళ్ల తర్వాత అవినాటన్ ఓర్-నోవా అర్గామణి కలుసుకున్నారు. అవినాటన్ ఓర్.. నోవా అర్గామణి ఉన్న గదిలోకి వెళ్లగానే ఒక్కసారిగా కౌగిలింతల్లో మునిగిపోయారు. ఒకరినొకరు కిస్‌లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరూ కలుసుకోవడానికి రెండేళ్లు పట్టింది. అనగా 738 రోజులు. 17,712 గంటలు పట్టింది.

ఇది కూడా చదవండి: Shashi Tharoor: మోడీ మంచి అవకాశాన్ని కోల్పోయారు.. శాంతి సదస్సుకు వెళ్లకపోవడాన్ని తప్పుపట్టిన శశిథరూర్

అర్గామణి చైనాలో జన్మించిన ఇజ్రాయెల్ పౌరురాలు. 245 రోజుల పాటు నిర్బంధంలో ఉండిపోయింది. గతేడాది జూన్‌లో ఐడీఎఫ్ దళాలు రక్షించాయి. ఆనాటి నుంచి బందీల విడుదల కోసం పోరాటం చేస్తోంది.

ఇక 20 మంది బందీలు కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాల్లో ఆనంద భాష్పాలు వెళ్లువెరిశాయి. కౌగిలింతలు, కిస్‌లతో సంతోషంగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. సోమవారం హమాస్ 20 మంది బందీలను విడుదలను.. నాలుగు మృతదేహాలను అప్పగించింది. అలాగే 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇక ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది.

Exit mobile version