Site icon NTV Telugu

Iran-Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ఇజ్రాయెల్

Iranisrael

Iranisrael

అగ్ర రాజ్యం అమెరికా హెచ్చరించినట్లుగా ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది. ఇరాన్‌పై ముందస్తు వైమానిక దాడులు చేసింది. టెహ్రాన్‌లోని ఒక ప్రాంతంపై దాడులు చేసింది. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇక టెహ్రాన్ నుంచి ప్రతీకార దాడులు ఉంటాయన్న భావనతో ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

ఇది కూడా చదవండి: PM Modi: నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోడీ.. మృతుల కుటుంబాలకు పరామర్శ

ఇక ఇజ్రాయెల్ దాడులపై అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్ చేసిన దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇరాన్‌కు చెందిన అణు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇరాన్ కూడా ప్రతిదాడులకు రెడీ అవుతోంది. దీంతో ఇజ్రాయెల్ అప్రమత్తం అయింది. క్షిపణులు, డ్రోన్లలతో ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. ప్రస్తుతం దేశమంతా ఎమర్జెన్సీ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: CM Chandrababu: సీఎం చంద్రబాబు వైజాగ్‌ టూర్ రద్దు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుగానే హెచ్చరించారు. పశ్చిమాసియా ప్రమాదకరమని.. తక్షణమే దౌత్య సిబ్బంది, సైనికులు ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇక దాడులు చేయొద్దని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించారు. అయినా కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా ఇజ్రాయెల్ ముందస్తు దాడులకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

Exit mobile version