NTV Telugu Site icon

Israel Iran: ఇరాన్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన ఇజ్రాయిల్..

Israel Iran

Israel Iran

Israel Iran: ఇజ్రాయిల్ శనివారం ఇరాన్‌పై విరుచుకుపడింది. ఆ దేశ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు నిర్వహించింది. సరిహద్దులో ఇరాన్ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసిన తర్వాత ఇజ్రాయిల్ దాడులు నిర్వహించింది. ఈ దాడిలో తేలికపాటి వార్‌హెడ్‌లను ఉపయోగించాయని ఇరాన్ సైన్యం తెలిపింది. అయితే, ఈ దాడిపై అమెరికన్ నిపుణులు విశ్లేషించారు. ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్‌కి చెందిన బాలిస్టిక్ మిస్సైల్ ఫెసిలిటీలపై దాడులు చేసినట్లు చెప్పారు.

ఇజ్రాయెల్ టెహ్రాన్ సమీపంలోని పర్చిన్ అనే భారీ సైనిక సముదాయంపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా ఖోజీర్ ప్రాంతంలో కూడా ఇజ్రాయిల్ దాడులు జరిపింది. ఈ ప్రాంతంలో ఇరాన్ అత్యంత విశాలమైన క్షిపణి ఉత్పత్తి వ్యవస్థ ఉందని చెబుతున్నారు. ఇజ్రాయిల్ దాడులు, ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. ఇజ్రాయిల్ తన దాడులకు ముందు ఇలామ్, ఖుజేస్తాన్, టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లోని సరిహద్దు రాడార్ వ్యవస్థలపై దాడులు చేసినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది.

Read Also: Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీంలీడర్‌కి తీవ్ర అస్వస్థత.. ఇజ్రాయిల్ దాడి తర్వాత కీలక విషయం..

మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ అతిపెద్ద ఆయుధ తయారీదారుగా ఉంది. ముఖ్యంగా మిస్సైల్ వ్యవస్థని ఇటీవల బలోపేతం చేసింది. అయితే, ఈ వ్యవస్థకు కీలకమైన ఫ్యూయల్ మిక్సింగ్ ఫెసిలిటీలపై దాడి చేయడంతో, మిస్సైల్ తయారీపై దెబ్బపడే అవకాశం కనిపిస్తుంది. ఇజ్రాయిల్ మూడు చోట్ల ఉన్న బాలిస్టిక్ మిస్సైల్ సాలిడ్ ఫ్యూయర్ మిక్సింగ్ భవనాలు, వేర్ హౌజ్‌పై దాడి చేసి ధ్వంసం చేసినట్లు పలువురు నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఇదే జరిగితే, ఇరాన్ తన ప్రాక్సీలైన హిజ్బుల్లా, హౌలీలకు మిస్సైల్ ఫ్యూయల్ ఇచ్చే విషయంలో దెబ్బతిన్నట్లే. మరోవైపు ఇరాన్ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మిస్సైల్స్ అందిస్తుందనే ఆరోపణ కూడా ఉంది.

Show comments