Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
- ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు
- ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
- బల్గేరియాలోని సోఫియా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ నుంచి వియన్నా వెళ్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు వచ్చింది. బాంబు బెదిరింపు సంకేతం రావడంతో టెల్ అవీవ్ నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు వెళ్తున్న ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బల్గేరియాలోని సోఫియా విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. విమాన సిబ్బంది అప్రమత్తం చేయడంతో అధికారులు వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. విమానంలో ఉన్న ప్రయాణికులను కిందకు దించి తనిఖీలు ప్రారంభించారు.
ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన OS82 విమానం ఎయిర్‌బస్ A320 రకానికి చెందినది. టెల్ అవీవ్ నుంచి వియన్నాకు ప్రయాణిస్తుండగా రొమేనియా సరిహద్దు సమీపంలో విమాన సిబ్బందికి బాంబు బెదిరింపునకు సంబంధించిన సంకేతం అందినట్లు బల్గేరియా రవాణా, సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యగా విమానాన్ని సోఫియాకు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని సిబ్బంది నిర్ణయించారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్24 సమాచారం ప్రకారం.. విమానం రాత్రి 9.25 గంటలకు (UTC) సోఫియా విమానాశ్రయంలో దిగింది. ఈ విషయాన్ని స్కై న్యూస్ వెల్లడించింది.
Also Read
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
- Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
- Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో మొత్తం 57 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు సిబ్బంది కాగా, 51 మంది ప్రయాణికులు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు తదుపరి భద్రతా చర్యలపై దృష్టి సారించారు. బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే ప్రామాణిక భద్రతా విధానాలను అమలు చేశారు. బల్గేరియా వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం గాల్లోకి ఎగిరి, ప్రయాణికుల విమానానికి తోడుగా ప్రయాణించింది. అనంతరం విమానం సోఫియా విమానాశ్రయంలో సురక్షితంగా దిగే వరకు పర్యవేక్షించింది.
విమానం ల్యాండ్ అయిన తర్వాత అధికారులు ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంబంధిత భద్రతా సంస్థలు విమానంలో తనిఖీలు ప్రారంభించాయి. ప్రయాణికులను విమానం నుంచి కిందకు దించారు. అయితే బాంబు బెదిరింపునకు సంబంధించిన అసలు వివరాలు ఏమిటి? విమానంలో ఏదైనా అనుమానాస్పద వస్తువు గుర్తించారా? అనే అంశాలపై అధికారులు ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం వెల్లడించలేదు. తనిఖీల్లో ఏం తేలిందన్నది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
OnePlus Ace 7 Pro: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ Ace 7 Pro.. 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్?
-
Babar Azam: బాబర్ ఆజమ్ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లీ రికార్డ్ సేఫ్..
-
Tiger Shroff Firing Incident: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. రంగంలోకి మహారాష్ట్ర ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!