NTV Telugu Site icon

Israel: “ఆపరేషన్ ఐరన్ స్వార్డ్” ప్రారంభం..మేం యుద్ధంలో ఉన్నామన్న ఇజ్రాయిల్..

Israel

Israel

Israel: పాలస్తీనా గాజా స్ట్రిప్ నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై మెరుపుదాడి చేశారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయిల్ భూభాగంపైకి 5000 రాకెట్ల్ ప్రయోగించారు. ఈ దాడుల్లో 50 మంది దాకా మరణించగా.. 30 మందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. గాజా ప్రాంతంలో ఇజ్రాయిల్ పౌరులపై మిలిటెంట్లు తుపాకులతో కాల్పులు జరిపారు. ఇజ్రాయిల్ పట్టణాల్లో స్వైర విహారం చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.

Read Also: India-Canada Tensions: నిజ్జర్ వివాదం తర్వాత తొలిసారి ఎదురుపడనున్న భారత్ – కెనడా ?

ఈ నేపధ్యంలో ఇజ్రాయిల్ ‘ఆపరేషన్ ఐరన్ స్వార్డ్’ ప్రారంభించింది. మేము యుద్ధంలో ఉన్నామని ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు అన్నారు. ఈ యుద్ధంలో తామే గెలుస్తామని తెలిపారు. హమాస్ ఉగ్రవాదులు భారీ మూల్యాన్ని చెల్లించుతారని వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయిల్ లోకి చొరబడిన ఉగ్రవాదుల్ని ముందుగా ఏరిపారేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. శతృవు ఎక్కడ ఉన్నా మూల్యం చెల్లించుకోవాల్సిందే అని అన్నారు. ఇజ్రాయిల్ ప్రజల్ని ఇళ్లలోనే ఉండాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.

దక్షిణ ఇజ్రాయిల్ లోని అనేక ప్రాంతాల్లో ఆర్మీ, ఉగ్రవాదులకు మధ్య యుద్ధం జరుగుతోంది. టెల్ అవీవ్ తో పాటు అన్ని ప్రధాన విమానాశ్రయాల్ని మూసేసింది. ఇజ్రాయిల్ భూభాగంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని ఆర్మీ తెలిపింది. పారాగ్లైడర్లు, సముద్రం, నేల ద్వారా చొచ్చకెళ్లి ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నామని, మేం పోరాడుతున్నామని ఇజ్రాయిల్ ఆర్మీ ప్రతినిధి అన్నారు. దాడికి తెగబడి హమాస్ ఉగ్రవాదులు పెద్ద తప్పు చేశారని రక్షణ మంత్రి యోవ్ గాలంట్ అన్నారు.