NTV Telugu Site icon

Lebanon-Israel War: హిజ్బుల్లా కమాండర్ అబూ అలీ సహా ఇద్దరు హమాస్ నేతలు హతం

Israel

Israel

హిజ్బుల్లా, హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే ఆ రెండు గ్రూపులకు సంబంధించిన అగ్ర నేతలందరినీ ఐడీఎఫ్ హతమార్చింది. వాటి మూలాలే లేకుండా అంతమొందించాలన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ దళాలు ముందుకు సాగుతున్నాయి. తాజాగా ఐడీఎఫ్ ఎక్స్ ట్విట్టర్‌లో కీలక పోస్టు చేసింది. దక్షిణ లెబనాన్‌లోని బరాచిత్ ప్రాంతంలో హిజ్బుల్లా కమాండర్ అబూ అలీ రిదాను హతమార్చినట్లు ఐడీఎఫ్ తెలిపింది. వైమానిక దాడిలో చనిపోయినట్లు స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దళాలపై రాకెట్, యాంటీ ట్యాంక్ క్షిపణి దాడులకు రిదా కుట్ర పన్నినట్లుగా ఐడీఎఫ్ తెలిపింది. అంతేకాకుండా హిజ్బుల్లా కార్యకర్తలకు ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: Team India: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. ఆ ట్రోఫీ నుంచి షమీ ఔట్..!

అంతేకాకుండా అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి కుట్రలో నిందితుడైన ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ సభ్యుడు అహ్మద్ అల్-దాలును కూడా గాజాలో హతమార్చినట్లు ఐడీఎఫ్ తెలిపింది. అహ్మద్ అల్.. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ కమ్యూనిటీ ఆఫ్ క్ఫర్ అజాలో జరిగిన ఊచకోతలో ఇతడు పాల్గొన్నట్లు పేర్కొంది. ఇతడితో పాటు మరో ఉగ్రవాదిని కూడా చంపినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. అహ్మద్ అల్ దాలు.. ఇజ్రాయెల్ పౌరులకు వ్యతిరేకంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసి అమలు చేశాడని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Rakul : 500 నోటు కాల్పించబోయాడు..షాకింగ్ విషయం చెప్పిన స్టార్ హీరోయిన్

అక్టోబర్ 7, 2023న పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. హమాస్ దుర్మార్గ చర్యలకు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇప్పటికే హమాస్‌కు అగ్ర నేతలను హతమార్చింది. అంతేకుండా హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను కూడా ఐడీఎఫ్ అంతమొందించింది. తాజాగా హిజ్బులా అధినేతగా నయీం ఖాసిం ఎన్నికయ్యాడు. ఇతడ్ని కూడా చంపేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది.

 

Show comments