Site icon NTV Telugu

Hamas-Israel: అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి వీడియోను విడుదల చేసిన నెతన్యాహు.. ఎందుకోసమంటే..!

Israel

Israel

అక్టోబర్ 7, 2023. ఇది ఎవ్వరూ మరిచిపోలేని తేది. ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన రోజు. హమాస్ ఉగ్రవాదులు మెరుపు వేగంతో ఇజ్రాయెల్‌పై దాడి చేసి కొందరిని చంపి.. ఇంకొందరిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ సంఘటన యావత్తు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది. ఇక అంతే వేగంగా ఇజ్రాయెల్ కూడా ప్రతి స్పందించింది. వెంటనే ఐడీఎఫ్ దళాలు రంగంలోకి దిగి ఎటాక్ ప్రారంభించాయి. హమాస్‌కు చెందిన కీలక నేతలను, కుట్రదారులను హతమార్చేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? తాజాగా ఆ నాటి హమాస్ దాడి దృశ్యాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మళ్లీ విడుదల చేశారు. బాధిత కుటుంబ సభ్యురాలు సబీన్ టాస్సాతో కలిసి దృశ్యాలు ఆవిష్కరించారు. మునుపెన్నడూ చూడని దృశ్యాలను ఆవిష్కరించారు. ఇందులో పసిబిడ్డలని చూడకుండా దారుణంగా హమాస్ క్రూరత్వంగా ప్రవర్తించింది. గాజాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలపై అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో నెతన్యాహు ఆనాటి దృశ్యాలు గుర్తుచేసుకోవాలన్న ఉద్దేశంతో విడుదల చేశారు. ఈ మేరకు పీఎంవో కార్యాలయం కూడా స్పష్టం చేసింది.

మళ్లీ ఇలాంటి దాడి జరగనివ్వని నెతన్యాహు హామీ ఇచ్చారు. ప్రపంచమంతా మరొకసారి ఈ దృశ్యాలను చూడాలనే విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచమంతా ఆనాటి దృశ్యాలను గుర్తుచేసుకోవాలని కోరారు.

అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్ కమ్యూనిటీలోని సబీన్ టాస్సా ఇంట్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. భర్త గిల్ టస్సా, కుమారులు కోరెన్, షే ఆశ్రమంలోకి పారిపోతున్నారు. అంతలోనే ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. గిల్ ప్రాణాలు కోల్పోయాడు. పిల్లలకు తీవ్రగాయాలు కారణంగా రక్తం కారుతోంది. ఎటు కదలకుండా చేశారు. అనంతరం తల్లి సబీన్, ఆమె ఇద్దరు పిల్లలు వేరే ఇంటికి పారిపోయారు. అలా ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక వీడియో విడుదల సందర్భంగా సబీన్ ధైర్యాన్ని నెతన్యాహు మెచ్చుకున్నారు. ఉగ్రవాదులు పిరికివారని.. సిగ్గుపడేలా చేసిందని పేర్కొన్నారు.

 

 

Exit mobile version