Israel-lebanon: అమెరికా మధ్యవర్తిత్వంలో లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు.. ఎప్పుడంటే..!
- లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు
- ఏప్రిల్ 14న వాషింగ్టన్ వేదికగా ఇరు దేశాల మధ్య చర్చలు
- అప్పటి వరకు దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌కు లెబనాన్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలకు అంగీకారం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ 14న (మంగళవారం) వాషింగ్టన్ వేదికగా అమెరికా ఆధ్వర్యంలో చర్చలకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది.
అయితే చర్చలు ప్రారంభం అయ్యేదాకా లెబనాన్‌పై దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను అమెరికా కోరింది. అందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరిస్తారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. లెబనాన్‌తో చర్చలు అంగీకారమే గానీ.. హిజ్బుల్లాతో మాత్రం చర్చలు జరపబోమని ఇజ్రాయెల్ తేల్చి చెబుతోంది.
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
బుధవారం ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. తాజాగా ఇస్లామాబాద్ వేదికగా రెండు దేశాల మధ్య శాంతి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇరాన్‌తో జరిగిన ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని.. దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. అన్నట్టుగా బుధవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీంతో 357 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయాలు పాలయ్యారు.
అయితే వచ్చే వారం వాషింగ్టన్‌లో లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరగబోతున్నట్లుగా ఆక్సియోస్ నివేదించింది. అంతలోపు దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను లెబనాన్ కోరింది. అయితే లెబనాన్ అభ్యర్థనకు అమెరికా మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా సానుకూలంగా స్పందించాలని ఇజ్రాయెల్‌ను కూడా కోరిందని ఆ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
శుక్రవారం వాషింగ్టన్‌లోని రాయబారుల మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఈ సంభాషణ సందర్భంగా అమెరికా మధ్యవర్తిగా వ్యవహరిస్తూ మంగళవారం అమెరికా విదేశాంగ శాఖలో ఒక అధికారిక సమావేశం నిర్వహించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. అయితే లెబనాన్‌తో శాంతి ఒప్పందం కోసం కృషి చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని.. కానీ హిజ్బుల్లాతో కాల్పుల విరమణపై చర్చించబోదని ఇజ్రాయెల్ రాయబారి యెచియెల్ లీటర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?