Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- రేపటితో గాజా-ఇజ్రాయెల్ యుద్ధానికి మూడేళ్లు
- అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి
- అనంతరం గాజాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 7, 2023 మరిచిపోలేని రోజు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజలు మరిచిపోలేని రోజు. ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన రోజు. చరిత్రలో గుర్తుండిపోయే రోజు. దీనికి కారణం పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదుల సృష్టించిన మారణహోమం. ఇజ్రాయెల్‌పై ఊహించని రీతిలో హమాస్ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే వేల సంఖ్యలో రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించారు. భూ, సముద్ర, వాయు మార్గాల ద్వారా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 1,200 మంది ఇజ్రాయెలీయులు, విదేశీయులు ప్రాణాలు కోల్పోగా… దాదాపు 251 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. అంతేధీటుగా ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడికి దిగింది. హమాస్ ఉగ్రవాదులే అంతంగా ప్రతీకార దాడులకు దిగింది. ఈ యుద్ధం ప్రారంభమై బుధవారంతో మూడేళ్లు పూర్తవుతుంది.
హమాస్ దాడితో ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీంతో పెద్ద పెద్ద భవంతులన్నీ కూలిపోయాయి. వందలాది మంది ప్రజల ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా హమాస్‌కు చెందిన కీలక నేతలంతా మట్టికరిచారు. ఇలా ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. ఇక ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక.. గాజాపై దృష్టిపెట్టారు. ఈజిప్ట్ వేదికగా శాంతి ఒప్పందం జరిగింది. దీంతో హమాస్ బందీలను విడతల వారీగా విడుదల చేసింది. ఇక ఇజ్రాయెల్ కూడా దాడులు తగ్గించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. గాజా పట్టణం పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పటికీ శిథిలాలు ఎక్కడికక్కడే ఉన్నాయి. ప్రజలు తిండి కోసం అలమటిస్తున్నారు. ప్రస్తుతం ఆయా దేశాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!