Site icon NTV Telugu

Hamas-Israel: బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక.. నెక్ట్స్ ప్లాన్ వెల్లడి

Hamasisrael

Hamasisrael

బందీలను వెంటనే విడుదల చేయాలని.. లేదంటే భారీ వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హమాస్‌కు ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా అదే కోవలో ఇజ్రాయెల్ కూడా చివరి హెచ్చరిలు ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ రాకతో యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌‌లో గందరగోళం.. అభిమానుల ఆగ్రహం

ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదివారం హమాస్‌కు చివరి హెచ్చరిక జారీ చేశారు. బందీలను విడిచిపెట్టాలి.. అలాగే ఆయుధాలను విడిచిపెట్టాలని ఆదేశించారు. లేదంటే తీవ్ర వినాశనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అత్యంత శక్తివంతమైన హరికేన్ గాజాను తాకుతుందని ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఇది కూడా చదవండి: Loan: రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించేందుకు ముందడుగేసిన ఆర్ బీఐ….

మరోసారి గాజా-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరగబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తోంది. గాజా లోపల.. విదేశాల్లో లగ్జరీ హోటళ్లలో ఉన్న హమాస్ హంతకులు.. రేపిస్టులకు ఇదే చివరి హెచ్చరిక అంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. బందీలను, ఆయుధాలను విడిచిపెడితే మంచిదని హమాస్‌కు సూచించింది.

ఉత్తర స్ట్రిప్‌లోని గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్ పెద్ద దాడికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ 10 లక్షల మంది నివాసితులు ఉన్నారు. ఇప్పటికే చాలా మంది వెళ్లిపోయారు. మరికొంత మందిని ఖాళీ చేయిపిస్తోంది. భీకరదాడులకు ఇజ్రాయెల్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ హఠాత్తుగా దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. అప్పటినుంచి యుద్ధం చేస్తూనే ఉంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక మధ్యలో ఒప్పందం ప్రకారం కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. మిగతా బందీలను కూడా విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. అయితే సైన్యం వెనక్కి వెళ్తేనే బందీలను విడుదల చేస్తామంటూ హమాస్ షరతులు పెడుతోంది.

Exit mobile version