Site icon NTV Telugu

Israel-Hamas: హమాస్‌తో యుద్ధం వేళ ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం!

Keke

Keke

హమాస్‌తో భీకరమైన యుద్ధం వేళ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు అమల్లో ఉన్న 34 నెలల నిర్బంధ సైనిక సేవ పరిమితిని మూడేళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Maharashtra: అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ కూటమికి భారీ విజయం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వీప్..

గత అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ అమాంతంగా దాడులకు తెగబడి ఇజ్రాయెల్ పౌరులను అపహరించుకునిపోయారు. దీంతో అప్పటి నుంచి పగతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం.. ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. హమాస్ లక్ష్యంగా గాజాపై భీకరమైన యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే గాజా పట్టణం సర్వనాశం అయింది. ఇదిలా ఉంటే ఉగ్రవాదులతో యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రతి పురుషుడు 34 నెలల పాటు తప్పనిసరిగా మిలటరీలో పని చేయాలన్న నిబంధన ఉండగా.. దీన్ని మూడేళ్ల పెంచుతూ ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సెక్యూరిటీ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్‌కు చెందిన వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. తాజా నిబంధనలు మరో ఎనిమిదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉంది. సెక్యూరిటీ కేబినెట్‌ నిర్ణయాలను ఆదివారం నిర్వహించబోయే పూర్తిస్థాయి కేబినెట్‌ సమావేశంలో ఓటింగ్‌కు పెట్టనున్నారు.

ఇది కూడా చదవండి: Vijay Devarakond: గొప్ప మనుసు చాటుకున్న విజయ్ దేవరకొండ

ఓ వైపు హమాస్‌, ఇంకోవైపు హెబ్‌బొల్లాతో ఒకేసారి యుద్ధం చేయాల్సి వస్తున్నందునే ఇజ్రాయెల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు ఇరాన్‌ పూర్తి మద్దతు ఉంది. వారిని ఎదుర్కోవాలంటే సైనిక సంపత్తిని కచ్చితంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఇజ్రాయెల్‌ మిలటరీ కమాండర్లు తెగేసి చెప్పడంతోనే అక్కడి ప్రభుత్వం ఈ దిశగా చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

Exit mobile version