NTV Telugu Site icon

Israel-Lebanon War: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భారీ దాడులు

Israellebanon War

Israellebanon War

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. లెబనాన్‌పై తాజాగా మరోసారి ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడింది. హిజ్బుల్లా ప్రదేశాలే లక్ష్యంగా 60 రాకెట్లు ప్రయోగించినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇందులో హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ విభాగం, ప్రధాన కార్యాలయం, ఇతర సౌకర్యాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం బుధవారం జరిపిన దాడుల్లో ఆరుగురు చనిపోయారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే తమ దేశ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని యూకే ప్రధాని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: UP: మహిళతో లేచిపోయిన తమ్ముడు.. అన్నకు శిక్ష..

నిన్నామొన్నటిదాకా హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. ఇప్పుడు హమాస్‌కు మద్దతుగా నిలిచిన లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. గత వారం కమ్యూనికేషన్ వ్యవస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. పేజర్లు, వాకీటాకీలు పేలి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇక ఈ వారం ప్రారంభంలోనే సోమవారం ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడింది. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా 600 రాకెట్లు ప్రయోగించింది. ఈ ఘటనలో 557 మంది చనిపోగా.. వందలాది మంది గాయపడ్డారు. హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్‌పై ప్రతి దాడుల్లో చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: AP CM Chandrababu: ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన