NTV Telugu Site icon

Israel: గాజాను సర్వనాశనం చేస్తాం, ప్రజలు వదిలిపోండి.. ఇజ్రాయిల్ ప్రధాని వార్నింగ్..

Benjamin Netanyahu

Benjamin Netanyahu

Israel: ఇజ్రాయిల్‌పై గాజా స్ట్రిప్ నుంచి హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేశారు. 5000 రాకెట్లతో ఇజ్రాయిల్ పై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పౌరులు, సైన్యాన్ని బందీలుగా పట్టుకుని గాజా నగరానికి తీసుకెళ్లారు .దీనికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ గా మారాయి. మిలిటెంట్లు ఇజ్రాయిల్ సైన్యానికి చెందిన వారిని చంపిన దృశ్యాలు, ఓ మహిళా సైనికురాలిని చంపి నగ్నంగా జీపులో తీసుకెళ్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.

Read Also: Israel-Palestine War: గత 24 గంటలుగా కొనసాగుతున్న యుద్ధం.. ఎన్ని వందల మంది మరణించారంటే ?

ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. గాజాపై వైమానిక దాడులు చేస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయిల్ లోకి చొరబడిని మిలిటెంట్లను ఏరిపారేస్తున్నాయి. తాము యుద్ధంలో ఉన్నామని ప్రకటించిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ.. ఇజ్రాయిల్ బలగాలు పూర్తి శక్తితో హమాస్‌ని నాశనం చేస్తాయని ప్రతిజ్ఞ చేశారు. హమాస్ అక్రమంగా ఇజ్రాయిల్ భూభాగంలోకిప ప్రవేశించి తమ పౌరులను చంపేసిందని, హమాస్ నిర్దాక్షిణ్యంగా యుద్ధాన్ని ప్రారంభించిదని.. ఈ యుద్ధంలో మేమే గెలుస్తామని, భారీ మూల్యాన్ని హమాస్ చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు.

హమాస్ మమల్ని చంపాలనుకుంది. మా పిల్లల్ని, వారి తల్లులను, పెద్దవారిని ఇళ్లలోకి దూరి చంపేశారు. పిల్లలను , అమ్మాయిలను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. హమాస్ ఉగ్రవాదులు పనిచేస్తున్న, దాకున్న అన్ని ప్రదేశాలను, ఆ దుర్మార్గపు నగరాన్ని నాశనం చేస్తామని, గాజా నగరాన్ని శిథిలాలుగా మారుస్తామని, గాజా నివాసితులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.