NTV Telugu Site icon

Israel: ఇజ్రాయిల్ అంతటా “హై అలర్ట్”.. హిజ్బుల్లా చీఫ్ మరణంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత..

Israel

Israel

Israel: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ ఈ రోజు చెప్పింది. బీరూట్‌లో జరిగిన దాడిలో అతను మరణించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, నస్రల్లా మరణం తర్వాత ఇజ్రాయిల్ హై అలర్ట్‌లోకి వెళ్లింది. దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని ఇజ్రాయిల్ మిలిటరీ శనివారం తెలిపింది. నస్రల్లా మరణం హిజ్బుల్లా చర్యల్ని మార్చడానికి కారణమవుతుందని ఇజ్రాయిల్ ఆర్మీ ఆశిస్తోంది. నస్రల్లాను చంపిన తర్వాత ఇజ్రాయిల్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ నదవ్ షోషాని మీడియా సమావేశంలో అన్నారు.

Read Also: Hassan Nasrallah: నస్రల్లాతో సహా హిజ్బుల్లా 9 మంది కమాండర్లు హతం.. తర్వాతి నాయకుడు ఇతడేనా..?

అయితే, ఇరాన్ మద్దతు కలిగిన హిజ్బుల్లాను మరింత నాశనం చేయడానికి ఇంకా సమయం పడుతుందని ఆయన అన్నారు. ఒక ఏడాది కాలంలో హిజ్బుల్లా తమపై దాడులు చేయడాన్ని చూశానమని అన్నారు. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాలు హై అలర్ట్‌లో ఉన్నాయని చెప్పారు.

ఈరోజు జరిగిన దాడిలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పడంతో దేశానికి ముప్పు కలిగించే ఎవరినైనా లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ప్రతిజ్ఞ చేసింది. నస్రల్లాతో పాటు సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ కర్కీని కూడా చంపేశామని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్రువీకరించినట్లు ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్,‌లో పోస్ట్ చేసింది. ఈ పరిణామాలతో మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది.

Show comments