NTV Telugu Site icon

Israel-Hezbollah: బీరుట్‌ను విడిచి వెళ్లిపోండి.. హెచ్చరించిన ఇజ్రాయెల్

Is

Is

Israel-Hezbollah War: హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్‌ దాడి కొనసాగుతుంది. ఈ తరుణంలో బీరుట్‌లోని దాహియాతో పాటు పొరుగుప్రాంత ప్రజలు తమ ఇళ్లను వదిలి పెట్టి వెళ్లాలని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఈమేరకు ఎక్స్‌ (ట్విట్టర్)లో ఓ వీడియోని పోస్ట్ చేసింది. ‘మా యుద్ధం హెజ్‌బొల్లాతో కానీ.. లెబనాన్‌ ప్రజలతో కాదు.. ఇజ్రాయెల్‌ పౌరులే లక్ష్యంగా హెజ్‌బొల్లా దాదాపు 1,50,000 రాకెట్లను లెబనాన్‌లో దాచింది.. వాటిల్లో కొన్ని వ్యూహాత్మకంగా పౌరులు నివసించే ఏరియాల్లో ఉంచింది.. కాబట్టి తాము ఆ ప్రాంతాలను నిర్వీర్యం చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. కావునా, ప్రజలు వెంటనే ఆ ప్రాంతాలను వదిలివెళ్లండి అని ఐడీఎఫ్ వెల్లడించింది.

Read Also: Assam : అస్సాంలో బంగ్లాదేశీయులపై చర్యలు.. బహిష్కరించిన వారి లెక్కలు చెప్పిన సీఎం

కాగా, ఉత్తర ఇజ్రాయెల్‌లోని పౌరులను హెజ్‌బొల్లా టార్గెట్ గా చేసుకున్నట్లు ఐడీఎఫ్‌ అధికారి తెలిపారు. లెబనాన్‌ నుంచి ప్రయోగించిన రాకెట్‌తో ఆ ఏరియా మొత్తం దెబ్బతిన్నట్లు పేర్కొన్నాడు. తమ పౌరులను లక్ష్యంగా చేసుకున్న హెజ్‌బొల్లా నుంచి తమ దేశ ప్రజలను రక్షించుకుంటామన్నారు. ఇదిలాఉండగా.. లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఈ దాడిలో 300 మంది మరణించినట్లు అక్కడి మీడియా ఓ కథనం ప్రసారం చేసింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్‌ నస్రల్లా కూడా చనిపోయినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని హెజ్‌బొల్లా వర్గాలు ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు.