Site icon NTV Telugu

గాజాపై ఇజ్రాయిల్ మ‌ళ్లీ దాడి…

నెల రోజుల క్రతం ఈజిప్ట్, అమెరికా చొర‌వ‌తో ఇజ్రాయిల్ కాల్పుల విర‌మ‌ణ‌ను ప్ర‌క‌టించింది.  అయితే, కొన్ని రోజుల క్రితం ఇజ్రాయిల్ కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటయింది.  గాజా స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకుంటార‌ని అనుకున్నారు.  కానీ, కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటైన మూడోరోజే గాజాపై ఇజ్రాయ‌ల్ బాంబుల వ‌ర్షం కురిపించింది.  గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో హ‌మాస్ ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే అనుమానంతో దాడులు చేసింది.  అయితే, ఈ దాడుల్లో ఎంత‌మంది మ‌ర‌ణించారు అనే విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌లేదు.  ప్ర‌మాద‌క‌ర‌మైన వాయువులు క‌లిగిన బెలూన్ల‌ను గాజా స‌రిహ‌ద్దుల్లో వ‌దులుతున్నార‌ని, వీటి కార‌ణంగా అగ్నిప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది.  ఈ నేప‌థ్యంలోనే ఇజ్రాయిల్ గాజాపై వైమానిక దాడులు చేసింది. 

Exit mobile version