US-Venezuela War: అమెరికా, వెనిజులా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యూఎస్ తమపై దాడి చేస్తుందని వెనిజులా భావిస్తోంది. అదే సమయంలో ఏ దాడికైనా సిద్ధంగా ఉండాలని వెనుజులా తన ప్రజలకు సూచించింది. ఇప్పటికే వెనిజులా తీర ప్రాంతంలో అమెరికా ఆర్మీ కదలికలు పెరిగాయి, దీంతో ఆ దేశంలో ఆందోళనలు పెరుగుతున్నాయి. శనివరం వెనిజులా సైన్యం మార్చ్ ప్రారంభించింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ ముదురో కూడా తన అత్యవసర అధికారాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా సన్నాహాలను చూస్తే తమ దేశంపై దాడి చేయవచ్చని ముదురో అన్నారు.
Read Also: IND vs PAK: ఈ లెక్కన గెలుపు మనదే..! ఆసియా కప్‌లో భారత్, పాక్ ఎన్నిసార్లు ఫైనల్‌కు వెళ్లాయంటే..?
గత నెలలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దక్షిణ కరేబియన్‌కు యుద్ధ నౌకలు, జలాంతర్గాములు పంపించడంతో ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అమెరికా సైన్యం కరేబియన్‌లోని వెనిజులా పడవలపై దాడులు చేసి, వాటిని ముంచేసింది. ఈ నౌకలు ఆ దేశానికి చెందిన మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులకు చెందినవిగా అమెరికా ఆరోపించింది.
ఈ ఘటన తర్వాత, అమెరికా సైన్యం వెనిజులాపై రాబోయే రోజుల్లో దాడులు చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు అమెరికా రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్సేత్, వర్జీనియాలోని మారుమూల సైనిక స్థావరంలో అమెరికా టాప్ ఆర్మీ అధికారులతో సమావేశం కాబోతున్నారు. ఇవన్నీ పరిణామాలు చూస్తే అమెరికా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లే తెలుస్తోంది. ఇదిలా ఉంటే, వెనిజులా అధ్యక్షుడు ముదురో పిలుపు మేరకు, వేలాది మంది ఆ దేశ ప్రజలు సాయుధ మిలిషీయాలో చేరారు. సైనిక బ్యారక్స్, నగర కేంద్రాల్లో జరుగుతున్న ఆయుధ శిక్షణలో వేలాది మంది పాల్గొన్నారు.
