Site icon NTV Telugu

Israel Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేస్తాం.. ఇజ్రాయిల్ వార్నింగ్..

Israel Iran War

Israel Iran War

Israel Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ‘‘ఇకపై ఉనికిలో ఉండటానికి వీలులేదు’’ అని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ గురువారం అన్నారు. ఖమేనీని చంపేస్తామని చెప్పకనే చెప్పారు. గురువారం టెల్ అవీవ్ సమీపంలోని ఆస్పత్రిపై ఇరాన్ మిస్సైల్ దాడి చేసిన తర్వాత ఇజ్రాయిల్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఈ దాడికి ఖమేనీ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.

Read Also: Pakistan: “డొనాల్డ్ ట్రంప్‌- ఆసిమ్ మునీర్ లంచ్”.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా లేదు..

‘‘పిరికి ఇరాన్ నియంత బలమైన బంకర్ కింద కూర్చుని ఇజ్రాయిల్ ఆస్పత్రులపై, నివాస భవనాలపై క్షిపణి దాడులు చేస్తున్నాడు. ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరం. ఖమేనీ దీనికి జవాబుదారీగా ఉంటాడు. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఇరాన్ సుప్రీం లీడర్‌ని నిర్మూలించడానికి చేయగలిగినదంతా చేస్తుంది’’ అని ఎక్స్‌లో కాట్జ్ చెప్పారు.

ఇజ్రాయెల్‌కు ముప్పులను తొలగించడానికి మరియు అయతుల్లా పాలనను అణగదొక్కడానికి ఇరాన్‌లోని వ్యూహాత్మక లక్ష్యాలపై మరియు టెహ్రాన్‌లోని ప్రభుత్వ లక్ష్యాలపై దాడుల తీవ్రతను పెంచాలని ప్రధాన మంత్రి, నేను IDFని ఆదేశించాము” అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అన్నారు. అయితే, దక్షిణ ఇజ్రాయిల్ ఆస్పత్రిపై దాడి గురించి స్పందించిన ఇరాన్, తమ దాడి లక్ష్యం ఆస్పత్రి కాదని, ఇజ్రాయిల్ సైనిక నిఘా స్థావరమని చెప్పింది.

Exit mobile version