Site icon NTV Telugu

Iran Attacks Israel: ఇజ్రాయిల్‌పైకి ఇరాన్ హైపర్‌సోనిక్ మిస్సైల్‌.. ఫత్తాహ్-1 గురించి కీలక విషయాలు..

Fattah 1

Fattah 1

Iran Attacks Israel: ఇరాన్ అణు కార్యక్రమాలే టార్గెట్‌గా శుక్రవారం నుంచి ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ అణు ఫెసిలిటీలు, అణు శాస్త్రవేత్తలు, మిలిటరీ టాప్ జనరల్స్‌ని టార్గెట్ చేసి చంపేసింది. ఇదిలా ఉంటే, ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ‘‘ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3’’ పేరుతో ఇజ్రాయిల్ పైకి క్షిపణి దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌కి ఉన్న బలమైన ఎయిర్ డిఫెన్స్ ఇన్‌కమింగ్ ఇరాన్ క్షిపణులను అడ్డుకుంది. కానీ ఇరాన్ ప్రయోగించిన ‘‘హైపర్ సోనిక్’’ క్షిపణులకు ఇజ్రాయిల్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఫత్తాహ్-1 హైపర్ సోనిక్ మిస్సైల్ ఇజ్రాయిల్‌ని పలు ప్రాంతాలను దెబ్బతీసింది.

తాము ఇజ్రాయిల్ పైకి హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ హైపర్‌సోనిక్ క్షిపణులను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్ 1, 2024న జెరూసలేంపై జరిగిన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ II సమయంలో ఇజ్రాయెల్‌ను ఢీకొట్టడానికి ఇరాన్ డజన్ల కొద్దీ ఫట్టా-1 క్షిపణులను ఉపయోగించింది.

హైపర్‌సోనిక్ క్షిపణి అంటే ఏమిటి?

హైపర్‌సోనిక్ అనే పదాన్ని తరుచుగా హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికిల్, హైపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను సూచించడానికి ఉపయోగిస్తారు. భూవాతావరణంలో హైపర్ సోనిక్ వేగంతో ప్రయాణించగలవు. అత్యంత వేగంగా వచ్చే ఈ క్షిపణులను అడ్డుకోవడం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌కి కూడా కష్టమవుతుంది. హైపర్‌సోనిక్ క్షిపణులు మాక్ 5 వద్ద లేదా ధ్వని వేగం కంటే ఐదు రెట్లు (గంటకు 3,800 మైళ్లు, గంటకు 6,100 కిలోమీటర్లు) ప్రయాణిస్తాయి. అయితే, దాదాపుగా అన్ని బాలిస్టిక్ క్షిపణులు తమ ఫ్లైట్ సమయంలో, ముఖ్యంగా లక్ష్యం వైపు దూసుకువచ్చే సమయంలో హైపర్ సోనిక్ వేగాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఫత్తాహ్-1 హైపర్‌సోనిక్ మిస్సైల్ గురించి వివరాలు:

ఫత్తాహ్-1 ఇరాన్ తొలి హైపర్‌సోనిక్ క్షిపణి. దీనిని 2023లో ఆవిష్కరించారు. ఇది సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దీనికి పేరు పెట్టారు. ఫత్తాహ్-1 ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్, ఆరో వంటి అత్యంత అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలను నుంచి కూడా తప్పించుకునేలా తయారు చేశారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దీనిని “ఇజ్రాయెల్-స్ట్రైకర్”గా అభివర్ణిస్తుంది.

ఈ క్షిపణి 12 మీటర్ల పొడవు మరియు 1,400 కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉంది. ఇరాన్ వాచ్ నివేదిక ప్రకారం, ఇది సింగిల్-స్టేజ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగించి ఘన ఇంధనంతో నడుస్తుంది. 200 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఫత్తాహ్-1 శత్రువుల రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకోవడానికి రూపొందించబడిన హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్ (HGV) వార్‌హెడ్‌తో అమర్చబడి ఉంటుంది. గంటలకు 17,900 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. ఇది మీడియం రేంజ్ క్షిపణి. ఇది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు చిక్కుకుండా తన పథాన్ని స్వల్పంగా మార్చు కోగలదు.

Exit mobile version