Iranian students ‘intentionally’ poisoned before mass protest: ఇరాన్ వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. 22 ఏళ్ల అమ్మాయి మహ్సా అమినిని హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి మరణించింది. ఈ మరణం ఇరాన్ వ్యాప్తంగా ఆగ్రహానికి కారణం అయింది. పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు, విద్యార్థులు హిజాబ్ కు, మోరాటిటీ పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు 300 మందికి పైగా మరణించారు. అయితే అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని పలు హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Read Also: India vs Bangladesh: పోరాడి ఓడిన భారత్.. వన్డే సిరీస్ బంగ్లా కైవసం
ఇదిలా ఉంటే ఇరాన్ లోని జాతీయ విద్యార్థి సంఘం సుమారు 1200 మంది యూనివర్సిటీ విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యారని పేర్కొంది. ఖరాజమీ, ఆర్క్ విశ్వవిద్యాలయాలు సహా మరో నాలుగు యూనివర్సిటీలకు చెందిన 1200 మంది విద్యార్థులు నిన్న ఆహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, శరీర నొప్పులు, తీవ్రమైన తలనొప్పులతో బాధపడ్డారు. దీంతో అక్కడి యూనివర్సిటీ కెఫెటేరియాల్లో తినకూడదని విద్యార్థులు నిర్ణయించుకున్నారు.
అయితే అధికారులు మాత్రం నీటిలో బ్యాక్టీరియా వంటి వాటి వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెబుతుంటే.. ది నేషనల్ స్టూడెంట్ యూనియన్ మాత్రం తినే ఆహారంలో విషం కలిపినట్లు ఆరోపిస్తోంది. రెండు నెలల క్రితం మహ్సా అమిని మరణంతో మొదలైన ఈ హిజాబ్ వ్యతిరేక ఉద్యమం, సుప్రీం లీడర్ గద్డె దిగాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. మహిళలు హిజాబ్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుంటూ నిరసనలు తెలిపారు. అయితే ఆందోనళతో దిగి వచ్చిన అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం మోరాలిటీ పోలీసింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఇరాన్ ప్రాసిక్యుటర్ జనరల్ మోహమ్మద్ జాఫర్ మోంటాజెరి ఈ విషయాన్ని ప్రకటించారు.
