Iran War: ఇరాన్ యుద్ధం బహ్రైయిన్ చావుకొచ్చింది.. పాలనమార్పు దిశగా చిన్న దేశం.!
- ఇరాన్ పాలన బహ్రైయిన్ చావుకొచ్చింది..
- బహ్రైయిన్‌లో పాలన మార్పు వస్తుందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి నెల రోజులైంది. అమెరికా చర్చల కోసం ఒత్తిడి పెడుతున్నా, ఇరాన్ మాత్రం తగ్గడం లేదు. ఇరాన్ తన ఆయుధ శక్తితో గల్ఫ్ లోని బహ్రైయిన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలపై దాడులు చేస్తోంది. ఈ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఆయిల్ గ్యాస్ క్షేత్రాలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్ని ఎలా అడ్డుకోవాలో గల్ఫ్ దేశాలకు అర్థం కావడం లేదు.
ఇదిలా ఉంటే, ఇరాన్‌లో పాలన మార్చాలని అమెరికా భావిస్తోంది. కానీ ఇరాన్ బదులుగా యూఎస్ మిత్రదేశం బహ్రైయిన్‌లో పాలన మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ చిన్న దేశంలో అంతర్గత సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బహ్రైయిన్‌లో పాలకుడు సున్నీ ముస్లిం కాగా, ప్రజల్లో మెజారిటీ షియా వర్గానికి చెందిన వారు. వీరంతా ఇప్పుడు ఇరాన్‌కు మద్దతుగా వీధుల్లోకి వస్తున్నారు. పరిస్థితి దిగజారడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
Also Read
- IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
- Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
- Trump: వైట్‌హౌస్ సిట్యుయేషన్ రూమ్‌లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
నివేదికల ప్రకారం, ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి బహ్రెయిన్‌లో 200 మందికి పైగా, వీరిలో అధికశాతం షియా ముస్లింలు, అరెస్టు చేయబడ్డారు. దేశద్రోహం, గూఢచర్య, శత్రువుకు సహకరించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 32 ఏళ్ల షియా కార్యకర్త మహమ్మద్ అల్మోసావి పోలీసుల అదుపులో మరణించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇతడిని చిత్రహింసలు పెట్టి చంపేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సున్నీల అధికారం, షియాల మెజారిటీ:
బహ్రైయిన్‌లో పాలకులు సున్నీ వర్గానికి చెందిన వారు. ప్రజల్లో మెజారిటీ 60 శాతం షియాలు. బహ్రెయిన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రైట్స్ అండ్ డెమోక్రసీ వంటి సంస్థలు దేశంలో తీవ్రవాద వాతావరణం ఉందని చెబుతోంది. చాలా మంది అరెస్టయిన వ్యక్తులకు న్యాయవాదుల్ని కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని చెబుతోంది. ఇరాన్‌కు మద్దతు ఇచ్చే పోస్ట్ పెట్టినా అరెస్ట్ చేస్తున్నారని వెల్లడించింది. బహ్రైయిన్ ఇరాన్ అనుకూల వర్గాల చేతిలోకి వెళ్లొద్దని సౌదీ అరేబియా భావిస్తోంది. దీంతోనే ఈ నిరసనల్ని అణిచివేసేందుకు సౌదీ బలగాలు సహకరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సౌదీ, బహ్రైయిన్ పాలకులు సున్నీ వర్గానికి చెందిన వారు.
బహ్రైయిన్‌లో యూఎస్ 5 ఫ్లీట్ నేవీ కమాండ్ కార్యాలయం ఉంది. దీనిపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడులకు బహ్రైయిన్ లోని మెజారిటీ షియాలు మద్దతు తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బహ్రైయిన్ 2011 నాటి అరబ్ స్ప్రింగ్ లాంటి పరిస్థితి ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బహ్రైయిన్ చాలా చిన్న దేశం అయినప్పటికీ, వ్యూహాత్మకంగా అమెరికాకు చాలా ముఖ్యమైన దేశం.
తాజావార్తలు
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!