Site icon NTV Telugu

Farideh Moradkhani: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మేనకోడలికి జైలు శిక్ష.. ఆ వ్యాఖ్యలు చేసినందుకే!

Morad

Morad

Iran Supreme Leader Niece Farideh Moradkhani Jailed For 3 Years: హిజాబ్‌కు వ్యతిరేకంగా దేశ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల్ని అణిచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే! అయినప్పటికీ అక్కడి మహిళలు వెనకడుగు వేయకుండా, తమ నిరసనల్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిరసనకారులపై ఇరాన్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఎలాగైనా ఈ ఆందోళనల్ని అణిచివేయాలని, ఉక్కుపాదం మోపుతోంది. ఈ వ్యవహారంలోనే తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మేనకోడలు అయిన ఫరీదే మొరాద్‌ఖనీని అరెస్ట్ చేసి, మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఆందోళనకారులకు ఆమె మద్దతు తెలపడంతో పాటు అక్కడి పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారన్న ఆరోపణలతో.. నవంబర్ 23న ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పుడు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

Drug Trafficking Gang: హైదరాబాదులో మరో సారి డ్రగ్స్ కలకలం.. కొరియర్‌ ద్వారా విదేశాలకు సరఫరా

మొరాద్ ఖనీ జైలు విక్షపై ఆమె తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. దేశంలోని న్యాయవ్యవస్థ నుంచి స్వతంత్రంగా ఉండే మతసంబంధిత కోర్టులో ఆమెపై విచారణ జరిగిందన్నారు. ఈ న్యాయవ్యవస్థ సుప్రీం నాయకుడికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని తెలిపారు. మొదట ఆమెకు 15 ఏళ్ల జైలు శిక్ష విధించారని, ఆ తర్వాత అప్పీల్ చేయడంతో మూడేళ్లకు శిక్షను కుదించారని అన్నారు. కాగా.. మొరాద్‌ఖనీ చాలాకాలంగా ఇరాన్‌ పాలనను విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఆందోళన నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు.. నిరసనకారుల్ని రెచ్చగొట్టేలా ఉండటంతో, ఆమెని అరెస్ట్ చేసి, జైలు శిక్ష విధించారు. అంతకుముందు.. మొరాద్‌ఖనీ తల్లి, సుప్రీం నేత అలీ ఖమేనీ సోదరి బద్రీ హొస్సేనీ ఖమేనీ కూడా ఇరాన్‌ పాలనపై తన వ్యతిరేకతను ప్రకటించారు. అప్పుడు తాము అలీ ఖమేనీతో తాము సంబంధాలన్నీ తెంచుకున్నామని ఆమె అన్నారు. ఆయన తన పదవి నుంచి వైదొలగాలని కూడా ఒక బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు.
Dr Vaishali Case: పెళ్లి నిజం కాదు.. అవన్నీ మార్ఫింగ్ ఫోటోలు

Exit mobile version