Anti-Hijab Protest: ఈ అల్లర్లకు కారణం.. ఆ రెండు దేశాల కుట్రే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Supreme Leader Ayatollah Ali Khamenei Breaks Silence On Anti Hijab Protests: మూడు వారాల నుంచి ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతోన్న ఆందోళనలపై ఎట్టకేలకు ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేని స్పందించారు. ఈ నిరసనల్ని తాను ఖండిస్తున్నానని ప్రకటించిన ఆయన.. అమెరికా, ఇజ్రాయెల్ పన్నిన కుట్ర ప్రకారమే ఈ ఆందోళనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘‘ఈ ఆందోళనలకి ముఖ్య కారణం.. అమెరికా, యూదుల పాలకులు, వారి ఉద్యోగులే. ఇటువంటి ఘటనలు అసాధారణమైనవి’’ అని ఆయన చెప్పారు. ఇదే సమయంలో ‘మహ్సా అమిని’ అమ్మాయి మృతి గురించి ప్రస్తావించిన ఆయన.. ఆ ఘటన తమనెంతో కలిసి వేసిందని అన్నారు.
ఇదిలావుండగా.. హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతూనే ఉంది. వేలమంది మహిళలు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా దళాల అణచివేతలో ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ.. నియంత పాలనకు ముగింపు పలకాల్సిందేనని తెగించి పోరాటం చేస్తున్నారు. దీంతో.. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతామని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెచ్చరించారు. కాగా.. హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న మాహ్సా అమిని అనే యువతిని అరెస్ట్ చేయడం, ఆమె సెప్టెంబర్ 16న ప్రాణాలు కోల్పోవడం వల్లే ఈ ఆందోళనలకు ప్రధాన కారణం.
Also Read
మరోవైపు.. ఇరాన్ నిరసనకారుల్ని అణిచివేసేందుకు అక్కడి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల్లో భాగంగా 92 మంది మరణించినట్టు నార్వేకు చెందిన మానవ హక్కుల సంస్థ ప్రకటించింది. సోషల్ మీడియాపై బ్యాన్ కూడా విధించింది. అయినప్పటికీ మహిళలు వెనక్కు తగ్గకుండా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. హిజాబ్ విసిరేస్తూ, జుట్టు కత్తిరించుకుంటూ.. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!