NTV Telugu Site icon

US-Israel: ఇజ్రాయెల్‌కు అమెరికా అలర్ట్.. ఇరాన్ క్షిపణి దాడి చేయొచ్చని హెచ్చరిక

Usalert

Usalert

హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బంకర్‌లో 60 అడుగుల లోతులో అత్యంత భద్రంగా ఉన్న నస్రల్లాను ఇజ్రాయెల్ బంకర్ బస్టర్‌ను ఉపయోగించి అంతమొందించింది. దీంతో లెబనాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మూల స్తంభం కూలిపోవడంతో హిజ్బుల్లా అయోమయానికి గురైంది. అంతేకాకుండా యావత్తు ప్రపంచమంతా నివ్వెరపోయేలా చేసింది. నస్రల్లా మరణం తర్వాత ప్రపంచమంతా ఒకటే చర్చ జరిగింది. ఇజ్రాయెల్ ఎలా చంపగలిగింది? అన్న చర్చే నడిచింది.

ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. ఫీజు కట్టలేదని విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్

ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు  ఇరాన్ కారాలు, మిరియాలు నూరుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అగ్ర రాజ్యం అమెరికా.. ఇజ్రాయెల్‌ను అలర్ట్ చేసింది. ఏ క్షణంలోనైనా ఇరాన్ క్షిపణి దాడిని చేయొచ్చని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు యూఎస్ అధికారి అలర్ట్ చేశారు. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ సిద్ధమవుతున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సూచనలు ఉన్నాయని వైట్ హౌస్ సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని వైట్‌హౌస్ వార్నింగ్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: China President: మున్ముందు చైనా గడ్డు పరిస్థితులు ఎదుర్కోనుంది..

ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది. హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా పెట్టుకుని సాగిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం.. మంగళవారం కూడా దాడులు కొనసాగించింది. బీరుట్ ప్రాంతంలో బాంబుల మోతతో దద్దరిల్లింది. అయితే ప్రాణనష్టంపై మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. మరోవైపు ఇరాన్ దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్ ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: New Liquor Policy: 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభం..