Ebrahim Raisi: ఇబ్రహీం రైసీ మరణానికి పేజర్లు పేలుళ్ల కారణం..
- లెబనాన్‌లో పేలిన పేజర్లు- వాకీటాకీలు..
- మాజీ అధ్యక్షుడు రైసీ మరణంపై ఇరాన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
- ఇబ్రహీం రైసీ మరణానికి పేజర్లు పేలుళ్ల కారణం: అహ్మద్ బక్షాయేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ebrahim Raisi: లెబనాన్‌లో ఇటీవల వరుసగా చోటు చేసుకున్న పేజర్లు, వాకీటాకీలు పేలిపోయాయి. హెజ్‌బొల్లా సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడినట్లు అనేక ఆరోపణలు బయటకు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ పార్లమెంటు సభ్యుడు అహ్మద్ బక్షాయేష్ అర్డెస్తానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మే నెలలో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాద ఘటనను పేజర్ల పేలుళ్లతోనే జరిగిందన్నారు. రైసీ కూడా పేజర్ వినియోగించేవారని ఛాపర్ లోపల పేజర్లు పేలిపోయి అది క్రాష్‌కు దారితీసిందని ఇరాన్ ఎంపీ ఆరోపించారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
కాగా, పేజర్ల కొనుగోలులో ఇరాన్ పాత్ర ఉందని ఎంపీ అహ్మద్ బక్షాయేష్ అర్డెస్తానీ సూచించారు. ఇరానియన్ దళాలు ఖచ్చితంగా హిజ్బుల్లా యొక్క పేజర్ల కొనుగోలులో పాత్రను పోషించాయి.. అందువల్ల మన స్వంత గూఢచార సంస్థలు కూడా ఈ విషయాన్ని పరిశోధించాలి అని సూచించారు. అయితే, ఈ నెల ప్రారంభంలో ఇరాన్ ప్రభుత్వం విడుదల చేసిన తుది దర్యాప్తు నివేదిక ప్రకారం.. దట్టమైన పొగమంచుతో సహా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్లే ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి కారణం అయిందని వెల్లడించారు. అలాగే, సెప్టెంబరు 16, 17న జరిగిన దాడుల్లో హిజ్బుల్లా సభ్యులు ఉపయోగించే పేజర్లు, వాకీ-టాకీలు పేలాయి. ఆ దాడుల్లో మొత్తం 39కి పైగా మృతుల సంఖ్య పెరిగింది. అలాగే, 3,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులు ఇజ్రాయెల్ చేసిందని విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!