NTV Telugu Site icon

Iran: హిజాబ్ ధరించని మహిళకు బ్యాంక్ సేవలు.. చివరకు మేనేజర్ పని ఖతం..

Anti Hijab Protest

Anti Hijab Protest

Iran Bank Manager Fired For Serving Woman Without Hijab: ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ దేశంలో హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు అక్కడి ప్రజలు. మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని హిజాబ్ ధరించలేదనే కారణంతో అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీలోనే మహ్సా అమిని మరణించింది. అప్పటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతోంది. మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టును కత్తిరిస్తూ.. హిజాబ్ విసిరేస్తూ ఆందోళన చేపడుతున్నారు. అక్కడి సుప్రీంలీడర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

Read Also: Rishi Sunak Daughter: కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్న రిషి సునాక్ కూతురు..

ఇదిలా ఉంటే హిజాబ్ వ్యతిరేక అల్లర్లకు పాల్పడిన వారికి ఉరిశిక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే పలువురికి శిక్షలను ఖరారు చేసింది. తాజాగా హిజాబ్ ధరించని మహిళకు బ్యాంకు సేవలు అందించినందుకు బ్యాంకు మేనేజర్ పై చర్యలు తీసుకుంది అక్కడి ప్రభుత్వం. తలను కప్పుకుని సరైన డ్రెస్ కోడ్ లేకుండా బ్యాంకుకు వచ్చిన ఓ మహిళకు రాజధాని టెహ్రాన్ సమీపంలోని కోమ్ ప్రావిన్సులోని బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ సేవలను అందించాడు. ఫలితంగా అతడిని పని నుంచి తొలగించింది అక్కడి ప్రభుత్వం. గవర్నర్ ఆదేశాల మేరకు ఆయన్న పదవి నుంచి తొలగిస్తున్నట్లు డిప్యూటీ గవర్నర్ అహ్మద్ హజిజాదే తెలిపారు.. మహిళకు సంబంధించిన వీడియో ఇరాన్ లో చాలా ప్రాచుర్యాన్ని పొందింది.

ఇరాన్ లో చాలా బ్యాంకులు ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. హిజాబ్ చట్టాన్ని అమలు చేయడం అక్కడి బ్యాంకు మేనేజర్ల బాధ్యత అని హజిజాదే అన్నారు. ఇదిలా ఉంటే ఇరాన్ లో అల్లర్లను పాశ్చాత్య దేశాాలు ప్రోత్సహిస్తున్నాయంటూ అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత, నాలుగు దశాబ్ధాల అనంతరం మరోసారి ఇరాన్ వ్యాప్తంగా భారీ హిజాబ్ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. 8 కోట్ల జనాభా ఉన్న ఇరాన్ దేశం హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో అట్టుడుకుతోంది.