US Strike: అమెరికా ఇరాన్‌పై దాడులు నిర్వహించిన కొన్ని రోజులు తర్వాత, తమ అణు సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇరాన్ ధ్రువీకరించింది. ఇరాన్‌లోని అత్యంత కీలకమైన, అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీ దెబ్బతిన్నట్లు శాటిలైట్ ఇమేజ్‌లు చూపిస్తున్నాయి. ఈ వారాంతంలో అమెరికా దాడుల్లో తమ దేశ అణు సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై బుధవారం అన్నారు.
Read Also: CM Revanth Reddy: ఐఏఎస్ అధికారులు వారానికి రెండు పాఠశాలలను సందర్శించాలి..
అల్ జజీరాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని బఘై ధ్రువీకరించారు. అయితే, పూర్తి వివరాలు చెప్పడానికి నిరాకరించారు. ఆదివారం అమెరికన్ బీ-2 బాంబర్లు బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించి ఇరాన్ లోని అణు కార్యక్రమాలపై దాడులు చేసింది. ఈ దాడుల గురించి అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ అణు కార్యక్రమాలు ఒక దశాబ్ద కాలం వెనక్కి వెళ్లేలా చేశామని అన్నారు.
అయితే, యూఎస్ దాడుల తర్వాత ఎలాంటి రేడియేషన్ వెలువడలేదని చెప్పింది. 12 రోజులు ఇజ్రాయిల్ ఇరాన్ సంఘర్షణలో ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లలోని పలు అణు కేంద్రాలపై ఇజ్రాయిల్, అమెరికాలు దాడి చేశాయి. యూఎస్ దాడులు తమ అణు కార్యక్రమాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగించినట్లు ఒప్పుకుంది.
