Site icon NTV Telugu

International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక నిర్ణయం

flights

కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది… ఇక, అంతర్జాతీయ ప్రయాణాలపై అనేక ఆంక్షలు విధించారు.. ప్రత్యేకంగా ఎంపిక చేసిన మార్గాలు, అది కూడా ప్రభుత్వ అనుమతితో.. మరీ ముఖ్యంగా ప్రత్యేక పరిస్థితుల్లో నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇక, త్వరలోనే రెగ్యులర్‌ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.. దీనిపై కీల‌క ప్రక‌ట‌న చేసింది కేంద్ర ప్రభుత్వం… ఈ నెల 27 నుంచి అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను పునః ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విమాన‌యాన శాఖ వెల్లడించింది.. కోవిడ్ విజృంభణతో నిలిచిపోయిన అంత‌ర్జాతీయ విమాన సర్వీసులు దాదాపు రెండేళ్ల త‌ర్వాత మళ్లీ ఎగరబోతున్నాయి..

Read Also: KCR: మత పిచ్చితో సమాజానికి నష్టం.. ఆ క్యాన్సర్ మనకొద్దు..

కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా విజయవంతం అయ్యిందని.. కోవిడ్‌ కేసులు తగ్గిపోవడం.. వ్యాక్సినేషన్‌ క్రమంగా పెరగడంతో… సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత 27వ తేదీ నుంచి అంత‌ర్జాతీయ విమానాల‌పై ఉన్న ఆంక్షల‌ను తొలగిస్తున్నట్టు.. ఇక, ఆ రోజు నుంచి అంత‌ర్జాతీయ విమానాల‌ను య‌థాత‌థంగా షెడ్యూల్ చేస్తామని కేంద్ర విమాన‌యాన శాఖ తెలిపింది.

Exit mobile version