Putin’s Security: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే, పుతిన్ సెక్యూరిటీ భారత్‌లో ఉంది. మరోవైపు, పుతిన్ కోసం భారత్ 5 అంచెల విస్తృత భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. పుతిన్ వ్యక్తిగత భద్రతా విభాగం, ఆయనను కంటికి రెప్పలా అడుగడుగు కాపాడుతోంది.
రష్యాలో అత్యంత రహస్య భద్రతా సంస్థల్లో ఒకటైన ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ (FSO) ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. పుతిన్ భద్రత దగ్గర నుంచి ఆయన ప్రయాణాలను, సందర్శించే ప్రదేశాలను ఎప్పటికప్పుడు వీరు పర్యవేక్షిస్తుంటారు. పుతిన్‌ను రక్షించే బాడీగార్డుల బయటకి కనిపించినా, ఆయనను కనిపించకుండా చాలా మంది రక్షిస్తూనే ఉంటారు.
Read Also: Modi-putin: పుతిన్‌ను స్వయంగా స్వాగతించనున్న మోడీ.. ఒకే కారులో ప్రయాణం.!
పుతిన్ వ్యక్తిగత భద్రతను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ (SBP) నిర్వహిస్తుంది. వీరంతా 35 ఏళ్ల లోపే ఉంటారు. 180 సెం.మీ కంటే ఎక్కువ ఎత్తు, శారీరకంగా దృఢంగా, పోరాటానికి సిద్ధంగా ఉంటారు. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. విదేశీ భాషలపై పట్టు, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్, నమ్మకస్తులుగా ఉండే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
2023లో రష్యా నుంచి పారిపోయిన మాజీ బాడీగార్డ్ గ్లేబ్ కరాకులోవ్, పుతిన్ భద్రత గురించి చెప్పారు. ఆయన సెల్‌ఫోన్‌లను వాడరని, కొన్ని సార్లు ప్రత్యేక రైళ్లలో ప్రయాణిస్తుంటారని చెప్పారు. పుతిన్ భద్రతా నెట్వర్క్‌లో స్నైపర్లు, డ్రోన్ ఆపరేటర్లు, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ నిపుణులు, కమ్యూనికేషన్ యూనిట్లు ఉంటాయి. పుతిన్ ఆహారాన్ని కూడా బాడీగార్డులు రుచి చూస్తారు. విషపూరితం భోజనం చేస్తే ముందుగా వారే ప్రభావితమవుతారు.
