NTV Telugu Site icon

Premarital Affairs: పెళ్లికి ముందు సెక్స్ చేశారో ఇక అంతే.. ఆ దేశంలో భారీ జరిమానా, జైలు శిక్ష

Indonasia

Indonasia

Indonesia set to make premarital sex punishable under new criminal code: ఇస్లామిక్ దేశం అయిన ఇండోనేషియాలో సంప్రదాయాాలు, ఆచార వ్యవహారాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. పేరుకు ముస్లిం దేశం అయినా కూడా కొన్ని ఆచార వ్యవహారాల్లో హిందూ సంప్రాదాయాలను పాటిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు, మతపరమైన వ్యవహారాలు, స్వలింగ సంపర్కం, బహిరంగంగా అబ్బాయి-అమ్మాయిలు కలిసి తిరగడం వంటివాటిపై ముందు నుంచి ఇండోనేషియా కఠినంగా వ్యవహరిస్తుందనే పేరు ఉంది. ఇదిలా ఉంటే ఇండోనేషియా కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకురాబోతోంది.

Read Also: Bihar: పాట్నా నుంచి అమెరికాకు 8 ఏళ్ల అనాథ.. మానవత్వానికి ప్రతీక ఈ ఘటన

పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొనడం, సహజీవనం చేయడం వంటి వాటిని నిషేధించేందుకు ఇండోనేషియా సర్కార్ సిద్ధం అయింది. కొత్తగా ఓ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. ప్రభుత్వం సిద్ధాంతాలు, అధ్యక్షుడు, ఇతర సంస్థలకు కించపరిచే వ్యాఖ్యలపై నిషేధం విధించనుంది. ఒకవేళ వీటిని అతిక్రమిస్తే ఏడాది పాటు జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధించేందుకు సిద్ధం అయింది. ఈ నెలలోనే కొత్తగా క్రిమినల్ కోడ్ ముసాయిదాను ఇండోనేషియా పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల ఆ దేశ డిప్యూటీ జస్టిస్ మినిస్టర్, మానవహక్కుల సంఘంతో సమావేశం అయిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పెళ్లికి ముందు సెక్స్ తో పాటు సహజీవనం చేయడాన్ని నిషేధిస్తుంది ఈ చట్టం. భార్య, భర్త లేని వారు ఎవరితో అయినా శృంగారంలో పాల్గొంటే వ్యభిచారం కింద వారిని శిక్షించనున్నారు. గరిష్టంగా ఏడాది పాటు శిక్షించడంతో పాటు జరిమానా విధించనున్నారు. ఇండోనేషియా ప్రజలతో పాటు విదేశీయులకు కూడా ఈ చట్టం వర్తింస్తుందని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండోనేషియా విలువలకు తగ్గట్లుగా ఈ చట్టం ఉండటం తమకు గర్వకారణం అని అక్కడి డిప్యూటీ జస్టిస్ మినిస్టర్ ఎడ్వార్డ్ ఒమర్ షరీఫ్ హియారిజ్ అన్నారు. అయితే కొత్తగా తీసుకురాబోతున్న ఈ చట్టం 2019 లోనే ఆమోదం పొందాల్సింది అయితే దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో వాయిదా పడింది.

Show comments