Site icon NTV Telugu

Helicopter Crash: ఇండోనేషియాలో కూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి

Helicopter Crash

Helicopter Crash

ఇండోనేషియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. వెస్ట్ కలిమంతాన్ ప్రావిన్స్‌లో హఠాత్తుగా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ఉన్న 8 మంది చనిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు.

ఎయిర్‌బస్ H130 హెలికాప్టర్ గురువారం ఉదయం మెలావి ప్రాంతంలోని ఓ తోట నుంచి ఎగిరిన ఐదు నిమిషాల్లోనే రాడార్ నుంచి అదృశ్యమైంది. ఇండోనేషియా రెస్క్యూ ఏజెన్సీ అధిపతి మహ్మద్ షఫీ ఈ విషయాన్ని తెలిపారు. సమీపంలోని అడవిలో హెలికాప్టర్ కూలిపోయింది. ఎత్తైన కొండల్లో కూలిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించినట్లు చెప్పారు. అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు. హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మొత్తం ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: UN-India: హార్ముజ్‌ను దిగ్బంధించడం భావ్యం కాదు.. ఐరాస‌లో భారత్ ఖండన

సైన్యం, పోలీసులు సహా రక్షణ బృందాలు భూమార్గం ద్వారా ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ మాథ్యూ ఎయిర్ నుసంతారా కంపెనీకి చెందినదిగా గుర్తించారు. హెలికాప్టర్.. సిట్రా మహ్కోటా అనే పామ్ ఆయిల్ కంపెనీ తోటలో పనిచేస్తోందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

Exit mobile version