Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం .. 209 విమానాలపై ప్రభావం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indonesia: ఇండోనేషియాలోని అనాక్ క్రాకటోవా అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున భారీగా విస్ఫోటనం చెందింది. ఈ విస్ఫోటనం కారణంగా వెలువడిన బూడిద పశ్చిమ ఇండోనేషియాలోని పలు ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో జకార్తాలోని సుకర్ణో – హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం 209 విమానాలు ఈ అగ్నిపర్వతం కారణంగా ప్రభావితమవగా.. సుమారు 22,800 మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ విమానాలు రెండూ ప్రభావితమయ్యాయని అధికారులు చెబుతున్నారు. జావా, సుమత్రా ద్వీపాల మధ్య ఉన్న సుండా జలసంధిలో అనాక్ క్రాకటోవా అగ్నిపర్వతం ఉంది. ఆదివారం ఉదయం 3:53 గంటల సమయంలో సుమారు 30 సెకన్ల పాటు విస్ఫోటనం జరిగిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అనంతరం రెండు భారీ బూడిద మేఘాలు ఏర్పడ్డాయని, ఒక మేఘం దాదాపు 20 వేల అడుగుల ఎత్తుకు చేరుకుని ఈశాన్య దిశగా కదిలిందని, దీని కారణంగా జకార్తా, బాంటెన్, పశ్చిమ జావా ప్రాంతాలు ప్రభావితమయ్యాయని పేర్కొంటున్నారు.
రెండో బూడిద మేఘం ఏకంగా 50 వేల అడుగుల ఎత్తుకు చేరినట్లు సమాచారం. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా వ్యాపిస్తూ బాంటెన్, లాంపంగ్, బెంగ్కులు, దక్షిణ సుండా జలసంధి, సుమత్రా పశ్చిమాన ఉన్న హిందూ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. బూడిద కారణంగా సుకర్ణో-హట్టా విమానాశ్రయంలో మొదట ఉదయం 5:30 గంటల వరకు విమానాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు, తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆంక్షలను ఉదయం 9:30 గంటల వరకు పొడిగించారు. విమానాశ్రయంలో రాత్రి పార్క్ చేసిన 170 విమానాలు అక్కడే నిలిచిపోయాయి. పలువురు ప్రయాణికులు టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడంతో పాటు చెక్-ఇన్ చేసిన సామాన్లను కూడా వెనక్కి తీసుకున్నారు.
Also Read
- Pakistan BLA: పాక్ సైన్యంలో కెప్టెన్.. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అధిపతి!
- US-Iran Tensions: అమెరికా మరోసారి తప్పు చేస్తే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
- Benjamin Netanyahu: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ సైరన్! ఇరాన్ అంతానికి నెతన్యాహు డెడ్లీ వార్నింగ్
- Donald Trump: ట్రంప్‌కు కోర్టులో మరో షాక్.. వైట్‌హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
సింగపూర్‌కు వెళ్లే అంతర్జాతీయ విమానాలపై దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. హాంకాంగ్, సిడ్నీ, ఆమ్స్టర్డామ్, సియోల్, దోహా, కౌలాలంపూర్ విమానాలు రద్దు, ఆలస్యం లేదా రీషెడ్యూల్ అయ్యాయి. లాంపంగ్, బాలి, సురబయ, మకాసర్ ప్రాంతాలకు వెళ్లే కొన్ని దేశీయ విమానాలపైనా కూడా దీని ప్రభావం పడింది. ప్రస్తుతం ఈ అగ్నిపర్వతం బద్ధలవ్వడం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, గాయాలపాలైనట్లు సమాచారం బయటికి రాలేదు. అలాగే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆదేశాలు కూడా జారీ కాలేదని తెలుస్తోంది. అయితే అగ్నిపర్వత క్రియాశీల క్రేటర్‌కు కనీసం 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలని ప్రజలు, పర్యాటకులకు అధికారులు సూచించారు. బూడిద పడే ప్రాంతాల్లో మాస్కులు, కళ్ల రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళ్లడం తగ్గించాలని, నీటి వనరులను మూసి ఉంచాలని అధికారులు సూచించారు. అనాక్ క్రాకటోవా చరిత్ర దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. 2018లో ఇదే అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా సంభవించిన సునామీలో కనీసం 430 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మళ్లీ ఈ అగ్నిపర్వతం బద్ధలవ్వడం, బూడిద వ్యాప్తిని ఇండోనేషియా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Allu Arjun: దుల్కర్ ఒక స్టార్ కిడ్ అయినా ఆ పొగరు ఏమాత్రం ఉండదు
-
Dulquer Salmaan: మేమిద్దరం ‘నెపో కిడ్స్’.. కానీ బ్యాక్‌గ్రౌండ్ లేని కొత్తమ్మాయిని లాంచ్ చేయడం మా అదృష్టం!
-
Sun Transit : రేపు సూర్యుడి రాశి మార్పుతో అదృష్టం.. ఈ 8 రాశులకు శుభ ఘడియలు!
-
ICC Schedules: 2035 వరకు ఐసీసీ క్రికెట్ టోర్నీల షెడ్యూల్ విడుదల.. ఇండియాలో ఆ వరల్డ్ కప్..
-
Akhilesh Ayodhya Visit: ‘‘నమాజ్ చేసిన ప్రాంతానికి వెళ్తున్నారు’’.. అఖిలేష్ ‘‘రామమందిర’’ సందర్శనపై ఓవైసీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!