Site icon NTV Telugu

Illegal Immigrant : అమెరికా అక్రమ వలసదారుల్లో మూడో స్థానంలో భారతీయులు..

Illegal Immigrant

Illegal Immigrant

Illegal Immigrant: అగ్రరాజ్యం అమెరికా వలసల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చాలా ఏళ్లుగా అక్రమ వలసదారులు ఆ దేశంలోకి ప్రవేశిస్తున్నారు. మెరుగైన అవకాశాలు, జీవనోపాధి పలు దేశాలను అమెరికా వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ అక్రమ వలసదారుల జాబితాలో భారతీయులు కూడా ఉన్నారు. అమెరికాలోకి అక్రమ వలసదారుల జనాభాలో భారతీయలు మూడో స్థానంలో ఉన్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనంలో వెల్లడించింది. వాటింగ్టన్‌కి చెందిన థింక్ ట్యాంక్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 7,25,000 మంది భారతీయలు అక్రమంగా నివసిస్తున్నారని తేల్చింది.

2017-2021లో పొరగున ఉన్న మెక్సికో నుంచి అత్యధికంగా అక్రమ వలసదారులు అమెరికాలోకి వచ్చారు. ఆ తర్వాతి స్థానంలో ఎల్ సాల్విడార్ (8,00,000)తో తర్వాతి స్థానంలో ఉంది. 2017 నుంచి భారత్ నుంచి అక్రమ వలసల సంఖ్య పెరిగింది. మొత్తంగా అమెరికాలో అనధికార వలస జనాభా 2021లో 10.5 మిలియన్లకు చేరుకుంది. 2007లో 12.2 మిలియన్ల గరిష్ట స్థాయికి దిగువ ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.

Read Also: Delhi High Court: సంపాదన సామర్థ్యం ఉన్న జీవిత భాగస్వామి ఖాళీగా కూర్చోలేరు.. భరణం కేసులో కీలక వ్యాఖ్యలు..

ప్రపంచంలో దాదాపు ప్రతీ ప్రాంతం నుంచి అంటే మధ్య అమెరికా, కరేబియన్, దక్షిణ అమెరికా, ఆసియా, యూరప్, సబ్ సహారా, ఆఫ్రికా నుంచి అనధికార వలసలు పెరిగాయని పరిశోధకులు చెప్పారు. అమెరికా అక్రమ వలసదారుల్లో వెనుజులా, బ్రిజిల్, కెనడా, మాజీ సోవియట్ దేశాలు, చైనా, డొమినికన్ రిపబ్లిక్ దేశాలకు చెందిన వారు ఉన్నాయి.

కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్, న్యూజెర్సీ మరియు ఇల్లినాయిస్లలో అత్యధిక సంఖ్యలో అనధికార వలసదారులు ఉన్న రాష్ట్రాలుగా నిలిచాయి. ఫ్లోరిడా, వాషింగ్టన్‌లలో అక్రమ జనాభా పెరుగుదల కనపించగా.. కాలిఫోర్నియా, నెవెడాలో క్షీణించినట్లు ఫ్యూ అధ్యయనం తెలిపింది. 2021లో US వర్క్‌ఫోర్స్‌లో కనీసం 4.6 శాతం మంది అనధికార వలసదారులను కలిగి ఉన్నారు. చట్టబద్ధమైన వలస జనాభా కూడా 2017-2021లో 8 మిలియన్ల కంటే ఎక్కువ పెరిగింది, ఇది 29 శాతం పెరిగింది.

Exit mobile version