Site icon NTV Telugu

Ukraine Crisis: ఉక్రెయిన్ నుంచి మొద‌లైన భార‌తీయుల త‌ర‌లింపు…

ఉక్రెయిన్ ర‌ష్యా మ‌ధ్య బోర్డ‌ర్ స‌మ‌స్య‌లు పెద్ద యుద్ద‌వాతార‌వ‌ణం నెల‌కొన్న‌ది. ఏ క్ష‌ణంలో ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొంటాయో తెలియ‌ని ప‌రిస్థితి. ఈనేప‌థ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న భార‌తీయుల‌ను వెన‌క్కి తీసుకొచ్చేందుకు భార‌త ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తున్న‌ది. ఉక్రెయిన్ నుంచి భార‌తీయుల‌ను త‌ర‌లించే ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. ఈరోజు ఉద‌యం 200 మంది భార‌తీయులు ఢిల్లీకి చేరుకున్నారు. మూడు విమానాల్లో వీరిని త‌ర‌లించారు. గురు, శనివారాల్లో మ‌రో రెండు విమానాలు ఉక్రెయిన్‌కు వెళ్ల‌నున్నాయి.

Read: Kalaavathi Song : డ్యాన్స్ అదరగొట్టేసిన తమన్… వీడియో వైరల్

ఇక ఇదిలా ఉంటే, యుద్ద భ‌యం నేప‌థ్యంలో విమానాయాన సంస్థ‌లు భారీ ఎత్తున టికెట్ ధ‌ర‌లు పెంచ‌డంతో తెలుగు విద్యార్థులు ఆందోళ‌న చెందుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో టికెట్ల ధ‌ర‌లు పెంచ‌డం స‌రికాద‌ని విద్యార్థులు పేర్కొన్నారు. వీలైనంత త్వ‌ర‌గా ఉక్రెయిన్ నుంచి భార‌తీయుల‌ను త‌ర‌లించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

Exit mobile version