Site icon NTV Telugu

Indiana Mall Shooting: అమెరికాలోని ఇండియానా మాల్‌లో కాల్పులు.. నలుగురు మృతి

Indiana Mall Shooting

Indiana Mall Shooting

Indiana Mall Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఇండియానాలోని ఓ షాపింగ్ మాల్‌లో ఓ దుండ‌గుడు కాల్పులు జ‌రిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల ఘ‌ట‌న గురించి స‌మాచారం అందుకున్న భద్రతా బ‌ల‌గాలు వెంట‌నే షాపింగ్ మాల్‌కు చేరుకుని దుండ‌గుడిని మ‌ట్టుబెట్టాయ‌ని గ్రీన్‌వుడ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జిమ్ ఐసన్ చెప్పారు.

షాపింగ్ మాల్‌లో కాల్పుల‌ ఘ‌ట‌న‌ను చూసిన వారు త‌మ‌ను సంప్రదించి వివ‌రాలు తెల‌పాల‌ని గ్రీన్‌వుడ్ పోలీసులు త‌మ‌ ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్ట్ చేశారు. ‘గ్రీన్‌వుడ్‌ పార్క్‌ మాల్‌లో ఆదివారం సాయంత్రం భారీస్థాయిలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు.’ అని గ్రీన్‌వుడ్‌ మేయర్‌ మార్క్‌ మయేర్స్ తెలిపారు. అమెరికాలో కాల్పుల ఘ‌ట‌న‌లు ప‌దే ప‌దే చోటు చేసుకుంటున్నాయి. ఓ నివేదిక ప్రకారం ఇలాంటి ఘటనల వల్ల 40 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించింది. ఈ నెల 4న కూడా చికాగోలో ఓ దుండ‌గులు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 35 మంది గాయాల‌పాల‌య్యారు.

Plane Crash in Greece: గ్రీస్‌లో కూలిన కార్గో విమానం.. 8 మంది సిబ్బంది దుర్మరణం

యూఎస్‌లో తుపాకీ హింస సంఘటనలు పెరుగుతున్నందున ఆయుధాలను నిషేధించాలని లేదా వాటిని కొనుగోలు చేసే వయస్సును 18 నుండి 21కి పెంచాలని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. జూన్ 22న, ఉవాల్డే, బఫెలో, టెక్సాస్‌లలో ఇటీవల జరిగిన సామూహిక కాల్పుల ఘటనలు దేశంలో సంచలనం సృష్టించిన తర్వాత, యూఎస్ చట్టసభ సభ్యుల బృందం ద్వైపాక్షిక తుపాకీ భద్రత బిల్లుపై ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Exit mobile version