NTV Telugu Site icon

Singapore: స్టార్ హోటల్‌ ఎంట్రన్స్‌లో మలవిసర్జన.. భారతీయుడికి కోర్టు రూ.25 వేలు ఫైన్

Indianworkersingapore

Indianworkersingapore

విదేశాల్లో చట్టాలు కఠినంగా ఉంటాయి. ఎలా పడితే అలా నడుచుకోవడానికి వీలుండదు. ఈ విషయాలు తెలియని కొందరు ఇష్టానుసారంగా ప్రవర్తించి చిక్కుల్లో చిక్కుకుంటారు. తాజాగా సింగపూర్‌లో భారతీయ కార్మికుడు చేసిన పనికి న్యాయస్థానం జరిమానా విధించింది.

సింగపూర్‌లో ఓ భారతీయ కార్మికుడు పనిచేస్తున్నాడు. గతేడాది క్యాసినో కోసం వెళ్లి మద్యం మత్తులో స్టార్‌ హోటల్‌ ఎంట్రన్స్‌లోనే మలవిసర్జన చేశాడు. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. ఈ కేసులో కార్మికుడిని దోషిగా తేల్చింది. రూ.25వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Kondapalli Srinivas: అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తాం..

సింగపూర్‌లో ఉంటున్న రాము అనే వ్యక్తి.. క్యాసినో ఆడేందుకు ప్రముఖ ‘మెరీనా బే సాండ్స్‌’ రిసార్ట్స్‌ అండ్‌ హోటల్‌కు వెళ్లాడు. అప్పటికే అతడు మద్యం మత్తులో ఉన్నాడు. కొద్దిసేపు గ్యాంబ్లింగ్‌ ఆడిన అతడు.. బాత్రూంకు వెళ్లాలనుకున్నాడు. కానీ మద్యం మత్తులో ఎంట్రన్స్‌ దగ్గర ఫ్లోర్‌ మీదే విసర్జించాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బయటకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది.. సీసీటీవీల్లో అతడిని గుర్తించి ప్రజారోగ్య నిబంధనల కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబర్‌ 30న చోటుచేసుకోగా.. ఇందుకు సంబంధించిన ఫొటో అప్పట్లో వైరల్‌గా మారింది. సుమారు 10 నిమిషాల పాటు బహిరంగంగా మలవిసర్జన చేశాడని.. కనీసం శుభ్రం చేసే ప్రయత్నం చేయలేదని పేర్కొంది.

ఇది కూడా చదవండి: RBI: ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌కు ఊరట.. గోల్డ్ లోన్ బిజినెస్‌పై ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేత

ఈ ఏడాది జూన్‌ 4న క్యాసినో కోసం రాము మళ్లీ అదే హోటల్‌కు వచ్చాడు. వెంటనే గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో రాము తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని తీవ్రంగా మందలించిన న్యాయమూర్తి రూ.25వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Kondapalli Srinivas: అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తాం..