Site icon NTV Telugu

US: సోర్ట్‌లో ఖరీదైన వస్తువులు దొంగతనం.. భారతీయ మహిళ అరెస్ట్

Usindianwomenarrest

Usindianwomenarrest

అమెరికాలో భారతీయ మహిళ దొంగతనానికి పాల్పడింది. టార్గెట్ స్టోర్‌లో రూ. లక్షకుపైగా విలువైన వస్తువులను దొంగిలిస్తూ పట్టుబడింది. బాడీక్యామ్ వీడియోలో చోరీకి పాల్పడిన ఘటన రికార్డయ్యింది. అమెరికాను సందర్శించేందుకు వచ్చిన ఆమెను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అరెస్ట్‌పై అధికారిక ప్రకటన రాలేదు.

ఇది కూాడా చదవండి: Nimisha Priya: నర్సును క్షమించొద్దు.. శిక్షించాల్సిందే.. బాధిత సోదరుడు డిమాండ్

స్టోర్‌లో ఏడు గంటల పాటు ఆమె గడిపింది. అనుమానాస్పదంగా తిరగడంతో సిబ్బంది నిఘా పెట్టారు. సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. రిటైల్ చైన్ నుంచి రూ.1.3లక్షల ఖరీదైన వస్తువులను చోరీ చేసిందని అధికారులు గుర్తించారు. స్టోర్‌లోని బాడీక్యామ్ ఫుటేజ్‌ను సేకరించారు. సదరు మహిళ ఫోన్‌ చూసుకుంటూ డబ్బు చెల్లించకుండా వెళ్లడానికి ప్రయత్నించిందని స్టోర్‌ సిబ్బంది పోలీసులకు తెలిపారు. సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు ఆమెకు సంకెళ్లు వేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వివిధ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇది కూాడా చదవండి: War 2: వార్ 2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. ఎన్టీఆర్ లుక్ అదుర్స్

 

Exit mobile version