పండగ సెలవులకు సింగపూర్ వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్న ఇద్దరు ఇండియన్స్ కు చుక్కెదురైంది. హోటళ్లలో చోరీకి పాల్పడి.. సె*క్స్ వర్కర్లపై దాడి చేసినందుకు వారిని అరెస్ట్ చేశారు పోలీసులు.
Read Also:Crime: 15 ఏళ్లుగా వివాహేతర సంబంధం.. మహిళా కానిస్టేబుల్ హత్య..
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువకులు… ఆరోక్కియసామి డైసన్ (23) ,రాజేంద్రన్ మయిలరసన్ (27) లు ఏప్రిల్ 24న భారతదేశం నుండి సింగపూర్‌కు సెలవుల కోసం వెళ్లారు. రెండు రోజుల తర్వాత, లిటిల్ ఇండియా ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్వారా ఇద్దరు వేశ్యల దగ్గరికి వెళ్లారు. ఆరోక్కియా రాజేంద్రన్‌కు డబ్బు అవసరమని చెప్పి హోటల్ రూంలో చోరీకి పాల్పడ్డారు. అనంతరం ఇద్దరు సె*క్స్ వర్కర్లపై దాడికి తెగబడ్డారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
Read Also: POK: పాక్ “పోకిరి రాజ్యం” : పీఓకే నాయకుడు జమీల్ మక్సూద్
పోలీసులు ఇద్దరిని కోర్టులో హాజరు పర్చారు. కోర్టు నిందితులకు ఐదు సంవత్సరాల ఒక నెల జైలు శిక్షతో పాటు 12 బెత్తం దెబ్బలు విధించింది. తమ దగ్గర డబ్బు లేదు. అందుకే మేము ఇలా చేసాము” అని ఆరోక్కియసామి అన్నారు. “తన భార్య, బిడ్డ భారతదేశంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని రాజేంద్రన్ తెలిపారు.
