Site icon NTV Telugu

1.42 మిలియ‌న్ల నుంచి వేల‌లోకి ప‌డిపోయిన భారత పర్యాటకుల సంఖ్య

క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపించింది.. కోవిడ్ విజృంభ‌ణ‌తో రెగ్యుల‌ర్‌గా న‌డిచే అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు నిలిచిపోవ‌డంతో.. విదేశీ ప‌ర్య‌ట‌కుల‌పై ఆ ప్ర‌భావం స్ప‌ష్టం క‌నిపింది.. సింగ‌పూర్‌కు వెళ్లే టూరిస్టుల సంఖ్య కూడా భారీగా త‌గ్గిపోయింది.. 2021లో సింగపూర్‌ను సందర్శించిన భారత పర్యాటకుల సంఖ్య భారీగా త‌గ్గిన‌ట్టు ఆ దేశం విడుద‌ల చేసిన నివేదిక చెబుతోంది..

Read Also: ఏపీ కోవిడ్ అప్‌డేట్‌.. ఈ రోజు ఎన్నికేసులంటే..?

2021 ఏడాదిలో తమ దేశంలో పర్యటించిన విదేశీ పర్యటకుల వివరాలను వెల్లడించింది సింగపూర్ టూరిస్ట్ బోర్డ్.. వాటి ప్ర‌కారం.. గ‌త రెండేళ్ల‌తో పోలిస్తే.. భార‌త ప‌ర్యాట‌కుల సంఖ్య భారీగా త‌గ్గిపోయింది.. 2019 సంవ‌త్స‌రంలో 1.42 మిలియన్ల మంది భారతీయులు సింగపూర్ లో ప‌ర్య‌టిస్తే.. ఆ సంఖ్య 2021కు వ‌చ్చే స‌రిగా భారీగా ప‌డిపోయింది.. గత ఏడాది కేవలం 54వేల మంది భారతీయులు మాత్రమే సింగపూర్‌ను సంద‌ర్శించిన‌ట్టు ఆ నివేదిక బ‌హిర్గ‌తం చేసింది.. అయితే, భారతీయ టూరిస్టులు ఎక్కువ ప్రయాణించే టాప్ 10 దేశాల జాబితాలో సింగ‌పూర్ ఒక‌టి అయిన‌ప్ప‌టికీ .. గ‌త ఏడాదిలో మాత్రం టూరిస్టులు సంఖ్య అమాంతం ప‌డిపోయింది. ఇదే అతిత‌క్కువ రికార్డుగా చెబుతున్నారు.

Exit mobile version